స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది.బన్నీయాక్టింగ్, త్రివిక్రమ్ టేకింగ్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా చూసేందుకు జనం థియేటర్ల వద్ద లైన్ కట్టారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అదనపు బలంగా నిలవడంతో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు యూత్‌ను ఆకట్టుకున అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 19 రోజులు పూర్తి చేసుకునే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.151.33 కోట్ల మేర వసూళ్లు సాధించింది.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 41.12 కోట్లు
సీడెడ్ – 17.50 కోట్లు
గుంటూరు – 10.61 కోట్లు
ఉత్తరాంధ్ర – 18.72 కోట్లు
ఈస్ట్ – 10.81 కోట్లు
వెస్ట్ – 8.48 కోట్లు
కృష్ణా – 10.19 కోట్లు
నెల్లూరు – 4.37 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 121.83 కోట్లు
కర్ణాటక – 8.93 కోట్లు
కేరళ – 1.17 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.44 కోట్లు
ఓవర్సీస్ – 17.96 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – 151.33 కోట్లు







