అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు( Astronauts ) అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేశారు.స్పేస్ స్టేషన్‌లో ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించడం ద్వారా వారు వ్యర్థ జలాల నుంచి స్వచ్ఛమైన తాగునీటిని( Pure Drinking Water ) సృష్టించగలిగారు.
వ్యోమగాముల చెమట, శ్వాసతో పాటు మూత్రం( Urine ) నుంచి కూడా వారు స్వచ్ఛమైన తాగునీటిని తయారు చేయగలిగారు.మొదటగా ఈ వ్యర్థ జలాలను ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఆస్ట్రోనాట్స్ సేకరిస్తారు.
తరువాత ఈ మురుగునీటిని శుద్ధి చేసి మలినాలను తొలగించి, తాగడానికి ఉపయోగపడే నీరుగా మారుస్తారు.
శాస్త్రవేత్తలు బ్రైన్ ప్రాసెసర్ అసెంబ్లీ అనే కొత్త టెక్నాలజీపై కూడా పని చేస్తున్నారు, ఇది మిగిలిన వ్యర్థాల నుంచి మరింత ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ టెక్నాలజీ వ్యర్థాలను నీరుగా మార్చడానికి ప్రత్యేక పొర, ఆవిరి ప్రక్రియను ఉపయోగిస్తుంది.
ఇకపోతే వ్యోమగాములు వారి మూత్రాన్ని నేరుగా తాగడం లేదు.వారు నీటిని వినియోగించే ముందు అది పూర్తిగా శుభ్రపరిచే ప్రక్రియ ద్వారా వెళుతుంది.వ్యోమగాముల ఆరోగ్యం, శ్రేయస్సు, అంతరిక్షంలో వారి విధులను నిర్వర్తించే వారి సామర్థ్యానికి స్వచ్ఛమైన నీటిని నిరంతరం సరఫరా చేయడం చాలా ముఖ్యం.
ఆహారాన్ని తయారు చేయడం, హైడ్రేటెడ్‌గా ఉంచడం, పరిశుభ్రతను కాపాడుకోవడం వంటి ఇతర ముఖ్యమైన పనులకు కూడా నీరు చాలా అవసరం.ఎక్కువ కాలం చేపట్టే అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాములు తగినంత స్వచ్ఛమైన నీటిని సమకూర్చుకోవడంలో ఈ ఆవిష్కరణ ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు.