పేద ప్రజలకు వారి ఇంటి వద్దే వైద్య సేవలు అందించేందుకు వీలు కలిపించే మొబైల్ మెడికల్ వ్యాన్ ను ప్రారంభించిన ఆస్టర్ వాలంటీర్స్, CSR విభాగం, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలను జెండా ఊపి ప్రారంభించిన శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట వారి CSR విభాగమైన ఆస్టర్ వాలంటీర్స్ వారు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పలు వ్యాధి నిర్థారణ శిబిరములను నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా పేదలకు లాభం చేకూర్చే ఈ ఉచిత వ్యాధి నిర్థారణ నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ అక్కడిక్కడే వ్యాధి నిర్థారణ పరీక్షలను నిర్వహించడానికి వీలు కలిపించే ప్రత్యేకమైన మొబైల్ వ్యాన్ సేవలను నేడు ఆస్టర్ వాలంటీర్స్ వారు అందుబాటులోనికి తీసుకొని వచ్చారు.
తద్వారా ఇంటి వద్దనే వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించి ఫలితాలను అందజేసేందుకు వీలవుతుంది.
ఇలా ప్రారంభించబడిన ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఆస్టర్ డియం ఫౌండేషన్ మరియు ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లైలాండ్ లిమిటెడ్ వారి CSR కార్యకలాపాలలో భాగంగా అందుబాటులోనికి తీసుకొని రాబడింది.
పూర్తి స్థాయి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను కలిగి పలు రకములైన వ్యాధి నిర్థారణ పరీక్షలు అనగా ఎత్తు, బరువు కొలచే పరికరములు, రక్త పోటు ( బిపి), షుగర్ పరీక్షల నిర్వహణ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ECG పరీక్షలతో పాటూ ఇతరత్రా ఆరోగ్య పరీక్షలు క్యాంపు నిర్వహణ స్థలంలోనే నిర్వహించడానికి వీలుగా ఈ మొబైల్ యూనిట్ రూపొందించబడింది.ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ను శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, గౌరవనీయులైన గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ వారు రోడ్ నెం.12, బంజారా హిల్స్ వద్ద నున్న మేయర్ క్యాంప్ కార్యాలయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, గౌరవనీయులైన గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ వారు మాట్లాడుతూ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారి CSR విభాగమైన ఆస్టర్ వాలంటీర్స్ ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికై ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించడాన్ని ప్రశంసించారు.
ఇపుడు ప్రారంభించబడిన మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా ఈ ఆరోగ్య శిబిరాలకు హాజరయ్యే పేద ప్రజలకు అవసరమైన ఆరోగ్య సంబంధిత పరీక్షలను అక్కడిక్కడే చేయడం వలన వారికి మరింత లబ్ది చేకూరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి మంచి సేవలను అందిస్తున్న ఆస్టర్ వాలంటీర్స్ వారు నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రజలు విరివిగా వినియోగించుకొని తద్వారా వారి ఆరోగ్యాన్ని నిరంతరం జాగురూకతతో పర్యవేక్షించుకొంటూ కాపాడుకోవాలని సూచించారు.

అంతకు ముందుగా కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలుకుతూ డా. ఉమా శ్రీదేవి, హెడ్, మెడికల్ సర్వీసేస్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాదు వారు మాట్లాడుతూ సంస్థ తరచుగా చేపడుతున్న పలు CSR కార్యక్రమాలను వివరించారు.బస్తీలలో నివసించే నిరుపేదలకు, కాలనీలలో నివసించే ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించడమే కాకుండా పలు ఇతర కార్యక్రమాలు అంటే పేదలకు యం ఆర్ ఐ, పెట్ సిటీ వంటి స్కాన్ లను ఉచితంగా అందజేసే ప్రయత్నం చేయడం, అవసరమైన చిన్నారులను ఉచిత శస్ర చికిత్సలు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని వివరించారు.ప్రస్థుతం అందుబాటులోనికి తీసుకొని రాబడిన మొబైల్ మెడికల్ యూనిట్ కారణంగా పేద ప్రజలకు అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను అందించడానికి వీలవుతుందని తద్వారా వారికి మరింత మేలు జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా మొబలైల్ మెడికల్ యూనిట్ తయారీకి సహకారం అందించిన అశోక్ లైలాండ్ లిమిటెడ్ ప్రతినిథి శ్రీ వి కృష్ణ శంకర్ మాట్లాడుతూ దేశంలో పలు ఆరోగ్య సంస్థలతో కలసి సంయుక్తంగా 11 మొబైల్ మెడికల్ వ్యాన్ లను సంస్థ అందుబాటులోనికి తీసుకొని వచ్చిందని చెప్పారు.తద్వారా అవసరమైన వారికి వారి ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందించాలనేది అశోక్ లైలాండ్ లిమిటెడ్ సంస్థ లక్ష్యమని, తదనుగుణంగా ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ తో కలసి ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ను అందుబాటులోనికి తెచ్చామని చెప్పారు.
మొబైల్ మెడికల్ యూనిత్ ప్రారంభోత్సవం తర్వాత ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వారు NBT నగర్ లో పేద ప్రజలకు నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గౌరవనీయులైన మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు.ఈ క్యాంపులో పలువురు పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను వైద్యులు నిర్వహించి అవసరమైన వారికి తగిన సూచనలు, మందులు అందజేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, మేయర్, గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ వారితో పాటూ డా ఉమా శ్రీదేవి, హెడ్, మెడికల్ సర్వీసెస్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్, అమీర్ పేట – శ్రీ వి కృష్ణ శంకర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, HR-CSR, ఆశోక్ లైలాండ్ లిమిటేడ్- శ్రీ నిథిన్ ఆంటోని, హెడ్, ఆపరేషన్స్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట, హైదరాబాదు – శ్రీ సుదీర్ బాసురి, హెడ్, బ్రాండింగ్ మరియు కమ్యూనిటీ కనెక్ట్ తో పాటూ పలువురు వైద్యులు, పారా మెడికల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.








