సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: సంఘాలు సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని, ప్రాథమిక సభ్యుల సంక్షేమాన్ని విస్మరించే సంఘం ఏది కూడా దీర్ఘకాలంలో మనుగడ సాగించలేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు.

ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ చేపూరి నాగరాజును అతని కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ , సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కాంభోజ ముత్యం, కోశాధికారి గంగు సతీష్, ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మాజిద్, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు జానంపేట మారుతి స్వామితో కలిసి పరామర్శించారు.

నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏఐజి, కిమ్స్ ఆసుపత్రులలో 24 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు.సొంత ఇల్లు కానీ, ఆర్థిక వనరులు కానీ లేని నాగరాజు కుటుంబానికి క్యాన్సర్ చికిత్స భారంగా పరిణమించిందన్నారు.

అటు ప్రెస్ అకాడమీ తరఫున, ప్రభుత్వం తరఫున నాగరాజు తదుపరి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, లోక సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ దృష్టికి నాగరాజు కుటుంబ పరిస్థితిని తీసుకువెళ్లి వారికి తగు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.

తెలంగాణలోని నిరుపేద జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఆరోగ్య బీమా పాలసీ రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకోసం జర్నలిస్టు సంఘాలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాల విభజన అనంతరం జర్నలిస్టు సంఘాలు నిస్తేజంగా మారిపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తమ సంఘాల్లోని ప్రాథమిక సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా శాఖల కార్యవర్గంపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి, జిల్లా ఇ సి మెంబర్ కట్టెల బాబు, కోశాధికారి కందుకూరి రవి, శ్రీ రామోజీ దేవరాజు ,చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News