ఏకకాలంలో ఇటు దక్షిణాది సినిమాల్లో, అటు బాలివుడ్ సినిమాల్లో అగ్రతారగా అలరించింది అసిన్.మంచి ఊపులో ఉండగానే తప్పుడు నిర్ణయాలతో కెరీర్ ను సొంత చేతులతో ఆపేసుకున్న అసిన్ ఆ తరువాత మైక్రోమ్యాక్స్ మొబైల్ సంస్థల అధినేత రాహుల్ శర్మతో పీకల్లోతు ప్రేమలో పడింది.
వీరిద్దరిని బాలివుడ్ హీరో అక్షయ్ కుమార్ దగ్గరుండి కలిపించాడు.ముందు ఈ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి ఉంచినా, కొంత కాలం క్రితం బయట పెట్టేసింది అసిన్.
ఇక ఈ అందాల భామ పెళ్లి ఇప్పుడంటూ, అప్పుడంటూ పలు ఊహాగానాలు వినిపించాయి.ఎప్పటికప్పుడు అసిన్ వాటిని తోసిపుచ్చుకుంటూ పోయింది.
అయితే తాజా సమాచారం ఏమిటంటే, అసిన్ పెళ్లి ఆహ్వాన పత్రికలు నిన్నే కొంతమంది బంధువులకు చేరాయి.కాబోయే భర్త వేల కోట్లకు అధిపతి కదా, పెళ్ళిపత్రిక బంగారు పూతతో చేయించారట.
దాని మీద జనవరి 23, 2016 న అసిన్ రాహుల్ ల పెళ్లి జరగనున్నట్టు రాసుందట.
రాజధాని డిల్లీలో పెళ్లి, ఆ తరువాత ముంబాయిలో పెద్ద పార్టి జరుగుంతుందట.
సినిమాలు మానేసిన ఇప్పుడు ఏం తక్కువైపోయిందని అసిన్ కి.తానూ సినిమాల్లో మరింత ఎత్తుకు ఎదిగి వేరేవాడ్ని పెళ్లి చేసుకోని ఉన్నా ఇంత దర్జా జీవితం దక్కేది కాదేమో.దేనికైనా రాసిపెట్టి ఉండాలి !