ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ( Skill development case )చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు.రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శలు చేస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీ ( Janasena party )160 సీట్లు గెలుస్తుందని టాలీవుడ్ నిర్మాత అశ్వినీ దత్ ( Ashwini Dutt )జోష్యం తెలియజేయడం జరిగింది.
నేడు రాజమండ్రిలో నారా భువనేశ్వరి,( Nara Bhuvaneshwari ) బ్రాహ్మణి లను కలిసి అశ్వినీ దత్ మద్దతు తెలిపారు.చంద్రబాబుని జైల్లో పెడతారని అసలు ఎవరు ఊహించలేదు.కానీ జగన్ ఆ పని చేశారు అని వ్యాఖ్యానించారు.
కచ్చితంగా జరగబోయే ఎన్నికలలో.చంద్ర సేనకు 160 సీట్లు సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ అశ్వినీ దత్ స్పష్టం చేయడం జరిగింది.
అశ్వినీ దత్ తో పాటు మురళీమోహన్ కూడా చంద్రబాబు సతీమణి భువనేశ్వరినీ… బ్రాహ్మణి నీ కలవడం జరిగింది.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారని ప్రశ్నించారు.
ఖచ్చితంగా త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.