సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి.ఈ బ్యూటీ గురించి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు.
బుల్లితెర ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ గా అషురెడ్డి తన పరిచయాన్ని పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.
తన అందాలతో ప్రతిరోజు విందు వడ్డిస్తుంది.తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుంది.ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై అవకాశం అందుకుంది.
అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.
ఆ తర్వాత బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.యాంకర్ గా కూడా ఓ షోలో చేసింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక రెండు సార్లు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.ఇక రెండో సారి చేసిన ఇంటర్వ్యూతో మాత్రం మరింత రెచ్చిపోయింది.వర్మ తో మాట్లాడిన తీరు, వర్మ తనతో ప్రవర్తించిన తీరు అందరిని షాక్ అయ్యేలా చేసింది.ఇక గత కొంత కాలం నుండి తన అందాలతో బాగా రెచ్చిపోతుంది.
పొట్టి పొట్టి బట్టలు, టైట్ గా ఉండే దుస్తువులు ధరిస్తూ తన అందాలను అన్ని బయటపెడుతుంది.ఎద, థైస్, నడుము, బ్యాక్ అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
దీంతో ఈమెకు బాగా కామెంట్స్ కూడా వస్తుంటాయి.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఈమధ్య ఈమె ఓవరాక్షన్ కూడా బాగా ఎక్కువ అవ్వటంతో ప్రతి ఒక్కరు ఈమెను బాగా టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.అయితే ఓ నెటిజన్.ఈ మధ్య నీకు ఓవరాక్షన్ బాగా ఎక్కువైంది అన్నట్లుగా అనిపించడం లేదా అని అడిగారు.దాంతో అషు రెడ్డి చాలా ఎక్కువ.
అంటూ ఈ మధ్యనే తగ్గింది అంటూ.నవ్వుతున్న ఎమోజితో పాటు చెప్పు ఎమోజిని పెట్టింది.
దీంతో ఆమె ఆ నెటిజన్ కు చెప్పు దెబ్బ ద్వారా సమాధానం ఇచ్చినట్లు అర్థమవుతుంది.







