తెలుగు బిగ్బాస్ ప్రేక్షకులకు అఖిల్ మరియు మోనాల్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వారిద్దరు కూడా షో లో ఎంతటి సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటి వరకు బిగ్బాస్ సీజన్ అన్నింట్లో కూడా వారిద్దరి జోడి మోస్ట్ రొమాంటిక్ గా పేరు దక్కించుకున్నారు.మోనాల్ హౌస్ లో అన్ని రోజులు ఉండడానికి కారణం.
అఖిల్ రన్నర్ గా నిలవడం కి కారణం కచ్చితంగా వారిద్దరి మధ్య జరిగిన కెమిస్ట్రీ అంటూ ప్రతి ఒక్కరు కూడా బల్లగుద్ది మరీ చెప్తారు.
అఖిల్ తో రొమాన్స్ మరియు లవ్ ట్రాక్ నడపడం వల్ల పలు సార్లు తక్కువ ఓట్లు వచ్చిన కూడా మోనాల్ సేవ్ అయింది అంటూ విమర్శలు వచ్చాయి.
ఆమె కోసం చాలా మంది బలమైన కంటెస్టెంట్స్ ని కూడా తప్పించారు అంటే ఆమె ను మరియు వారి లవ్ ట్రాక్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఎంతగా సమర్థించారో అర్థం చేసుకోవచ్చు.ప్రతి బిగ్బాస్ సీజన్ లో కూడా లవ్ ట్రాక్ లు ఉంటేనే బాగుంటుంది అని నిర్వాహకులు బలంగా నమ్ముతున్నారు.
అందుకే ప్రతి సీజన్లో కూడా ఒక లవ్ ట్రాక్ ని నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బిగ్బాస్ నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సీజన్ లో కూడా లవ్ ట్రాక్స్ ను నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అనిల్, అజయ్ మరియు అఖిల్ లతో లవ్ ట్రాక్లను అమ్మాయిల నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.అందుకోసం ఒక్కరు ఒక్కరు మెల్ల మెల్లగా ట్రాక్ సెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అఖిల్ తో అషు రెడ్డి ట్రాక్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత రెండు మూడు ఎపిసోడ్లు గా ఇద్దరి మధ్య కాస్త ఎక్కువగానే మాటలు సాగుతున్నాయి.
ఇద్దరు కూడా ఎక్కువ సమయం ఒంటరిగా మాట్లాడుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తాజా ఎపిసోడ్ల ను చూస్తే వెల్లడయింది.

అషు రెడ్డి ఎవరు ఏం మాట్లాడినా కూడా ఫీల్ అవ్వట్లేదు కానీ అఖిల్ ఏమైనా మాట్లాడితే ఫీల్ అవ్వడం తో పాటు అతడు ఏమన్నా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నట్లు గా చూపిస్తున్నారు.తద్వారా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంది అనిపించేలా వారు వ్యవహరిస్తున్నారు అనిపిస్తుంది.అఖిల్ గతంలో మోనాల్ తో ఎలా అయితే కెమిస్ట్రీని పండించి లవ్ ట్రాక్ నడిపించాడో అదే తరహా లో అషు రెడ్డి తో చేయబోతున్నాడు అనిపిస్తుంది.అదే కనుక జరిగితే అఖిల్ మరియు రెడ్డి ఇద్దరూ కూడా కచ్చితంగా లాస్ట్ వరకి ఉండే అవకాశాలు ఉన్నాయి.







