ఇటీవల బీసీసీఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పొందిన టీమిండియా క్రికెటర్లంతా ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అవ్వాల్సి ఉంటుంది.
దీంతో భారత క్రికెటర్లంతా ఒక్కొక్కరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కు చేరుకుంటున్నారు.మరో రెండు రోజుల్లో వారి భవితవ్యం తేలనుంది.
అందులో ఫెయిల్ అయితే ఐపీఎల్ కూడా ఆడనివ్వబోమని బీసీసీఐ స్పష్టం చేసింది.దీంతో అందరి దృష్టీ హార్దిక్ పాండ్యాపై పడింది.
గతేడాది టీ20 వరల్డ్ కప్ సమయానికి వెన్నునొప్పితో హార్దిక్ పాండ్య తీవ్రంగా బాధ పడ్డాడు.దీంతో ఆల్ రౌండర్ అయిన అతడిని బౌలింగ్ వేయించకుండా ఆడించారు.
ఆ తర్వాత జట్టుకు ఎంపికైంది లేదు.తాజాగా అతడు ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ప్రస్తుతం ఆ జట్టు భారమంతా హార్దిక్‌పైనే ఉంది.దీంతో ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయితేనే ఐపీఎల్‌లో పాల్గొంటారని బీసీసీఐ చెప్పడంతో అందరి దృష్టి హార్దిక్‌పై పడింది.
ఇటీవల ఆయనను మీడియా పలకరించినప్పుడు సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పాడు.అతడు అలా అనింది బౌలింగ్ చేయడంపైనే అని తెలుస్తోంది.

ఇటీవల గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్వహించిన శిబిరంలో కెప్టెన్ హార్దిక్ 135 కి.మీ.వేగంతో బంతులు విసిరినట్లు తెలుస్తోంది.హార్దిక్ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తే ఇక ఆ జట్టుకు తిరుగుండదు.
ప్రస్తుతం బెంగళూరు ఎన్‌సీఏలో ఉన్న హార్దిక్‌కు 10 ఓవర్లు బౌలింగ్ చేసే సామర్థ్యముందా అనే విషయాన్ని పరిశీలిస్తారు.ఇక యోయో టెస్టులో హార్దిక్ 16.5 పాయింట్ల కనీస స్కోరును కచ్చితంగా దాటుతాడు.బౌలింగ్ టెస్టులో కూడా పాస్ అయితే జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది.







