అతి తెలివా? అజ్ఙానమా?

రాజకీయ నాయకులు కొందరు విచిత్రంగా వ్యవహరిస్తుంటారు.పదవి లేనప్పడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవారు కూడా పదవి రాగానే ఏది తోస్తే అది మాట్లాడుతుంటారు.

 Ashok Gajapathi Raju Confesses Carrying Matchboxes On Flights-TeluguStop.com

ఒక్కోసారి తెలివితక్కువగా, ఒక్కోసారి అతి తెలివిగా మాట్లాడతారు.ఆంధ్రప్రదేశ్‌ టీడీపీలో అశోక్‌ గజపతిరాజు పెద్దమనిషి తరహాగా ఉంటారు.

రాజవంశానికి చెందిన ఈ సీనియర్‌ రాజకీయ నాయకుడు కమ్ విమానయాన శాఖ మినిస్టర్‌ అతి తెలివితోనో, అజ్ఙానంతోనో అడిగిన ప్ర శ్న ఏమిటయ్యా అంటే…ప్రపంచంలో ఎక్కడైనా అగ్గిపెట్టె కారణంగా విమాన ప్రమాదం జరిగిందా? అలాంటి ప్రమాదం జరిగివుంటే నాకు చెప్పండి తెలుసుకోవాలని ఉంది అని అన్నారు.ఇది ఆయన కుతూహలంతో అడిగిన క్వశ్చన్‌ కాదు.‘నేను విమానాల్లో ప్రయాణించేటప్పడు అగ్గిపెట్టె వెంట ఉంచుకుంటాను’ అని అదేదో ఘనకార్యంలా చెప్పారు.వెంటనే అధికారులు నోరెళ్లబెట్టారు.

మండే వస్తువులు విమానంలోకి అనుమతించరనే సంగతి అశోక్‌కు తెలుసు.ఆయనకు విమాన ప్రయాణాలు కొత్తకాదు కదా…! అగ్గిపెట్టె పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమని కూడా తనకు తెలుసని చెప్పారు.

నిబంధన బాగానేఉందిగాని అగ్గిపెట్టె కారణంగా ప్రమాదాలు జరిగాయా? చెప్పండి అని అడిగారు.ఈ ప్రవ్నకు జవాబు ఏమిటో? ఇలాంటి ప్రమాదం జరిగినట్లు మనమూ వినలేదు కదా…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube