గత సంవత్సరం మలయాళంలో విడుదలైన ‘బెంగళూరు డేస్’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.దాంతో ఆ సినిమాను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేసేందుకు దిల్‌రాజు మరియు పొట్లూరి వర ప్రసాద్ రైట్స్‌ను దక్కించుకున్నారు.
మొదట తెలుగు మరియు తమిళంలో కూడా హీరో హీరోయిన్‌గా సిద్దార్థ్ మరియు సమంతలను ఎంపిక చేయడం జరిగింది.త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందన్న సమయంలో వారి ప్రేమ బ్రేకప్ అవ్వడంతో, ఈ సినిమాలో నటించమని వేరు వేరుగా ప్రకటించారు.
దాంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం వాయిదా వేయడం జరిగింది.
ఇటీవలే తమిళంలో ఈ సినిమా రీమేక్ ప్రారంభం అయ్యింది.
తమిళంలో ఆర్య, రానా, బాబీ సింహాలు హీరోలుగా నటిస్తున్నారు.హీరోయిన్‌గా శ్రీదివ్యను ఎంపిక చేయడం జరిగింది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాను ఇదే సంవత్సరం విడుదల చేయాలని నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి భావిస్తున్నాడు.
తమిళంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు ఊసు మాత్రం ఇప్పటి వరకు లేదు.దిల్‌రాజు ఈ సినిమా పనులను ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లుగా అనిపించడం లేదు.
ఈ సినిమా కోసం తెలుగులో పలువురు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి.అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటన రాలేదు.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళంలో తెరకెక్కుతున్న మూవీనే తెలుగులో డబ్బింగ్‌గా విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.తమిళంలో నటిస్తున్న రానా, ఆర్యలు ఎలాగూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కనుక, పెద్దగా ఇబ్బందేం ఉండదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.







