ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి మీద స్పందించిన ఆయన మొదటి భార్య...

సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి( Ashish vidyarthi ) తాజాగా రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరిచాడు .అసోంకు చెందిన రూపాలి బారువాను( Rupal Barua ) 60ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నాడు .

 Ashish Vidyarthi Ex Wife Rajoshi Barua Responds On His Second Marriage Details,-TeluguStop.com

ఇదే అంశంపై ఆశిష్‌ విద్యార్ధి మొదటి భార్య రాజ్‌షీ బారువా( Rajoshi Barua ) స్పందించిన తీరుపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి .తన అల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అతడికి విషెస్ చెబుతున్నట్లుగా.నవ్వుతూ ఉన్న ఫోటోతో పాటు కొన్ని వీడియోలను రాజ్‌ షీ బారువా షేర్ చేసింది .మనసులోని బాధను, ఆవేదనను దిగమింగుకుంటూ భర్త చేసిన పని పట్ల పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైరల్ అవుతోంది…

భర్త రెండో పెళ్లి చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టారు.అశిష్‌ విద్యార్ధికి మొదటి వివాహం నటి శకుంతల బారువా కుమార్తె, సింగర్‌ రాజ్‌ షీ బారువాతో జరిగింది.వీరిద్దరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.కూతురికి వివాహం కూడా అయింది .బెంగాలీ సంప్రదాయం ప్రకారం అల్లుడిని ఇంటికి పిలిచి ఇష్టమైన వంటకాలతో భోజనం పెడతారు.అందులో భాగంగానే అశిష్‌ విద్యార్ధి మొదటి భార్య రాజోషి బారువా అల్లుడి పేరును అడ్డుపెట్టుకొని భర్త చేసిన పనిపై చింతిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.మీరు చాలా మంచి వారు.

 Ashish Vidyarthi Ex Wife Rajoshi Barua Responds On His Second Marriage Details,-TeluguStop.com

మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని ప్రశ్నించను.

Telugu Rajoshi Barua, Rupali Barua-Movie

మీరు బాధ కలిగించే పని చేయరు.అది మాత్రం గుర్తుంచుకోండ.అని ఒక పోస్ట్ పెట్టింది .అలాగే మీ మనసులో చింతలు, సమస్యలు, సందేహాలు తొలగించండి.వీటన్నింటి తర్వాత మీకు ప్రతిదీ స్పష్టంగా అర్దమవుతుంది.

అప్పుడు మీ జీవితంలో శాంతి మిగులుతుంది.చాలా కాలంగా మీరు సమస్యలతో పోరాడుతున్నారు.

మీకు అంతా మంచి జరగాలి.కాని జీవితపు చిక్కుల్లో చిక్కుకోవద్దు అంటూ నవ్వుతున్న ఫోటోని పోస్ట్ చేసింది .60సంవత్సరాల నటుడు .

Telugu Rajoshi Barua, Rupali Barua-Movie

సంపూర్ణమైన కుటుంబ జీవితాన్ని కాదనుకొని మరో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించడం పై ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు.ఇక 1986లో నటుడిగా పరిచయమైన అశిష్‌ విద్యార్ధి.300 సినిమాలకుపైగా నటించారు.ఇక అశిష్‌ మొదటి భార్య రాజ్‌షీ బారువా, రెండో వివాహం చేసుకున్న రూపాలి బారువా ఇద్దరూ అసోంకి చెందిన వాళ్లే కావడం విశేషం.తన భర్తతో గతంలో దిగిన వీడియోలను కూడా రాజ్‌షీ ఇంకా ఇన్‌స్టా నుంచి తొలగించకపోవడం విశేషం.

అయినా ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకోవడం .ఆ ఫోటోలు వైరల్ కావడంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube