ఆర్జీవీ మాటలతో నమ్మకం వచ్చిందంటున్నా ఆశ ఎంకౌంటర్ హీరోయిన్!

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అంటే చాలామందికి ఆ హీరోయిన్ పై ఒక ఇంప్రెషన్ ఉంటుంది.

రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఎక్కువగా గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని, అంతేకాకుండా పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

కానీ హీరోయిన్ సోనియా ఆకుల మాత్రం అలా కాదు అది తప్పు అని అంటోంది.తెలంగాణలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సోనియా ఆకుల రామ్ గోపాల్ వర్మ తో రెండు సినిమాలు చేసింది.

కానీ ఎప్పుడు కూడా హద్దులు దాటి ప్రవర్తించలేదు.అయితే అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీఇచ్చినప్పటికీ సోనియా తన అందం అభినయం, నటనతో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఈమె నటనకుగాను ఏకంగా రాంగోపాల్ వర్మ తోనే ప్రశంసల వర్షం అందుకుంది.ఒకవైపు నటనలో రాణిస్తూనే మరొకవైపు సమాజ సేవ కోసం ఈమె పలు స్వచ్ఛంద సంస్థలను స్థాపించి వాటికోసం సాయశక్తులా కృషి చేస్తోంది.

Advertisement

సినిమాలు తన ప్రవృత్తి అయితే.సమాజ సేవ తన వృత్తి అని సోనియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఆమె బీటెక్ పూర్తి అయిన తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ల లో జాబ్ చేసిందట.ఆ సమయంలో అక్కడ అక్కడ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగేవట.

అయితే ఆ సమయంలో ఈమెకు హిందీ, తెలుగు, ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉండటంతో ఆమెను కొన్ని కార్యక్రమాలకు ఫస్ట్ గా పిలిచేవారట.

అలా రవీంద్రభారతిలో సినీవారం ప్రోగ్రామ్ కు మామిడి హరికృష్ణ హోస్ట్ గా చేయించారట.అదే సమయంలోనే సోనియా పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిందట.ఆ తర్వాత ఆమెకు యాడ్స్ లో కూడా నటించే అవకాశం వచ్చిందట.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

అలా వాటిని చూసిన ఆమెకు జార్జి రెడ్డి సినిమా లో చెల్లెలు పాత్రన ఇచ్చారు.అందులో ఆమె నటన చూసి ఇంప్రెస్ అయిన రాంగోపాల్ వర్మ వైరస్ సినిమాలో మొదటి సారిగా హీరోయిన్ గా అవకాశం ఇచ్చారట.

Advertisement

అయితే ఆమె యాక్టింగ్ నేర్చుకోక పోయినప్పటికీ సమాజాన్ని, సినిమాలు చూసి నటనపై అవగాహన పెంచుకుందట.అయితే కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న సమయంలో ప్రజలు విపరీతంగా భయపడుతున్నా సమయంలో అపోహలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి అన్న సందేశాన్ని వైరస్ సినిమా ద్వారా ఇచ్చాం అని చెప్పుకొచ్చింది సోనియా.

అలా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన మాటలతో తనకు నమ్మకం పెరిగింది అని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు