ఈరోజు రేపు ఎల్లుండి ఉత్తర కోస్తా ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కొన్నిచోట్ల 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం విశాఖపట్నం గంగవరం మచిలీపట్నం కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద సూచిక ఎగురవేత
అసాని తుఫాన్ పరిస్థితులు నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో సముద్రతీర ప్రాంతాల్లో ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.
ఇందులో భాగంగా నక్కపల్లి సీఐ నారాయణరావు ఎస్.రాయవరం ఎస్సై శ్రీనివాస్ లు ఎస్ రాయవరం మండలం లోని రేవుపోలవరం, బంగారమ్మ పాలెం మత్స్యకార గ్రామాలకు వెళ్లి గ్రామస్తులకు సమావేశపరిచి, సముద్రంలోకి వేటకు తుఫాన్ తగ్గేవరకు వెళ్లవద్దని హెచ్చరించారు.జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించండి అని తెలియపరిచారు