అసలేం జరిగింది? అదుర్స్.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న హారర్‌, థ్రిల్లర్‌ మూవీ!

కరోనా సెకెండ్ వేవ్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.పలు సినిమాలు థియేటర్లలో విడుదలై జనాలకు వినోదాన్ని పంచుతున్నాయి.

 Asalem Jarigindi Movie Review , Asalem Jarigindi , Review , Tollywood , Telengan-TeluguStop.com

తాజాగా శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా తెరకెక్కిన మూవీ అసలేం జరిగింది? ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలంగాణ‌లో జ‌రిగిన వాస్త‌వ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకు ఎన్వీఆర్ దర్శకత్వం వహించాడు. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ ఎక్స్‌ డోస్ మీడియా బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌ స్టోరీగా జనాల ముందుకు వచ్చింది.ఇందులో ప్రేమ‌, స‌స్పెన్స్, యాక్ష‌న్ సంమిళితంగా ఉన్నాయి.

ఈ మూవీకి ఎలేంద‌ర్ మ‌హావీర్ మ్యూజిక్ అందించాడు.తాజాగా ఈ సినిమా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ లో రిలీజ్ అయ్యింది.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1970- 80 ప్రాంతంలో తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఓ కనిపించని శక్తితో హీరో ఎలా పోరాడాడు అనేది ఈ సినిమా కథ.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో కూడిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీగా జనాలకు కొత్త అనుభూతి కలిగించింది అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి అవసరం లేదు.టైటిల్ మూలంగానే జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది.అటు సినిమా కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.కొత్త కాన్సెప్టు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో రూపొందిన ఈ సినిమా హార్రర్‌, థ్రిల్లర్‌ ను ఎంజాయ్ చేసే జనాలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Telugu Harer, Malavika, Raghava, Review, Sriram, Telengana, Thriller, Tollywood,

విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్రకాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గవి పిళ్లై సహా పలువురు పాడిన ఈ సినిమా పాటలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాకు ఎస్‌.చిన్నా అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ చక్కగా కుదిరింది.

సినిమాలోని అన్ని సీన్లకు అనుగుణంగా ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్ అనిపించింది.సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ జనాలకు సినిమా మొదలు నుంచి చివరి వరకు ఆకట్టుకున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మ‌హావీర్ స్వర‌క‌ల్పన బాగుంది.

Telugu Harer, Malavika, Raghava, Review, Sriram, Telengana, Thriller, Tollywood,

రాఘ‌వ అలియాస్ ఎన్‌వీఆర్‌ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు.ప్రతి సీన్ జనాల్లో ఉత్కంఠ రేపుతుంది.హీరో శ్రీరామ్ నటన ఈ సినిమాకు చక్కటి ప్లస్ పాయింట్ గా మారింది.

రోజాపూలు, ఒకరికి ఒకరు సినిమాల్లో న‌టించి మెప్పించిన హీరో శ్రీ‌రామ్ ప్రస్తుతం ఈ సినిమాతో ముందుకు వచ్చాయి.త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు.

చాలా రోజుల తరువాత.శ్రీ రామ్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు అసలేం జరిగింది? సినిమాతో వచ్చాడు.హీరో, హీరోయిన్ల నటన చాలా బాగుంది.హారర్‌, థ్రిల్లర్‌ మూవీలను ఇష్టపడేవారు కచ్చితంగా ఈ సినిమాకు వెళ్లి తీరాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube