కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్( Feroz Khan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ నియోజకవర్గ ఎంపీగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీని( Asaduddin Owaisi ) గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా ఇదే నిర్ణయించారని తెలిపారు.
ఈ క్రమంలోనే తమ కెప్టెన్ ఏది ఆదేశిస్తే అదే చేస్తానని ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు.అయితే వ్యక్తిగతంగా మాత్రం తానెప్పుడూ అసదుద్దీన్ ఒవైసీతో కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.