తెలంగాణ బీజేపీ రోజురోజుకు మరింత దూకుడుగా ముందుకెళ్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్న బీజేపీ తాజాగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొనేలా వ్యూహ రచన చేస్తోంది.
తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సెటైర్ లు విసిరారు.కేసీఆర్ కు బీజేపీ అంటే భయం మొదలయిందంటూ అందుకే ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగాలని సూచనలు చేశారని ఇది బీజేపీ సాధించిన విజయం అంటూ బండి సంజయ్ ఛలోక్తులు విసిరారు.
కేసీఆర్ కు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఎన్ని జిమ్మిక్కులు వేసినా అంతగా సాధించేది ఏదీ లేదని రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఎవ్వరూ ఆపలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
అయితే గ్రామాల్లోకి బీజేపీ నాయకులు వస్తే ఉరికించి కొట్టాలని టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ పిలుపునిచ్చిన సందర్భంలో బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా ఇదే తరహా విధానాన్ని కొనసాగించారని తద్వారా అక్కడ బీజేపీ పెరిగిందే తప్ప తగ్గలేదని ఇక్కడ కూడా ఆ పరిస్థితికి తీసుకరావద్దని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్న తరుణంలో రానున్న రోజుల్లో ఎన్నికలు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే జరిగే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే స్థానాలు తగ్గినా అధికారం మాత్రం కోల్పోయే అవకాశం లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
సర్వేలు మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉన్న పరిస్థితి చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది.