గత కొన్ని సంవత్సరాలుగా దేశం మొత్తం మీద అత్యంత ప్రభావవంతం గా ,బలమైన శక్తి గా ఎదురులేనంతగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ…2014 తో మొదలుపెట్టి ఇప్పటికీ అదే హవా కనిపిస్తుంది…మామూలుగా ఐతే మన దేశం లో ఏదో ఒక జాతీయ పార్టీ అధికారం లో ఉన్నప్పటికీ ఒకటి రెండు మార్లు గడిచే సరికి ప్రజా వ్యతిరేకత ను ఎదుర్కోవాల్సి రావడం ,ప్రతిపక్ష జాతీయ పార్టీ బలం గా పోటీ ఇవ్వడం ,అధికారం మారడం సాధారణం…ఐతే 2014 లో బీజేపీ అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి పరిస్థితి వేరేలా ఉంది…ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటికీ విమర్శల్లో కానీ,పోరాటాల్లో కానీ ,నిరసన కార్యక్రమాలలో కానీ ,ప్రజా వ్యతిరేకను తనకు సానుభూతిగా మార్చుకోవడం లో కానీ ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపించడం లేదు…దీంతో బీజేపీ కి ఇక ఇప్పట్లో తిరుగులేదు అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి…దీంతో పాటు దేశం లో ఎప్పటికప్పుడు జరిగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతూనే ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కి సరైన పోటీ ఇస్తూ ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కి మరో ప్రత్యామ్నాయం గా కనిపిస్తూ ఎదుగుతున్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP )… దేశ రాజధాని ఢిల్లీ లో మొదలుపెట్టి మెల్లిగా పంజాబ్(Punjab ) లాంటి ఇతర సరిహద్దు రాష్ట్రాలలో కూడా తన ప్రభావం చూపిస్తుంది…ఇందులో భాగంగా గానే దేశం లోని బీజేపీ వ్యతిరేక సీఎం లను ,రాజకీయ పార్టీలను కలుపుకుని ఒక సమగ్ర శక్తి గా మారేందుకు పావులు కదుపుతోంది… ఈ విషయం పై ఇప్పటికే కాంగ్రెసేతర రాష్ట్రాల సీఎం లతో ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా (G8) పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి విందుకు ఆహ్వానించడం కూడా జరిగింది…ఐతే వివిధ కారణాల వల్ల ఇది కార్యరూపం దాల్చలేదు…ఐతే కేజ్రీవాల్( Arvind Kejriwal ) మాత్రం బీజేపీ పై పోరాటాన్ని ఆపలేదు… ఎప్పటికప్పుడు బీజేపీ వ్యతిరేక విమర్శల్లో వాడి వేడి పెంచుతునే ఉన్నారు…

తాజాగా బీజేపీ( BJP ) నీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రిటిష్ పాలకుల కంటే కూడా బీజేపీ నాయకత్వమే ప్రమాదకరం గా మారిందని, ఇప్పటికి దేశానికి అది పెద్ద కష్టం వారేనని విమర్శించారు… అంతే కాకుండా ఢిల్లీ అసెంబ్లీ లో బడ్జెట్ గురించి జరుగుతున్న చర్చ లో భాగం గా మాట్లాడుతూ గత 65 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము 8 ఏళ్లలో చేసి చూపించామన్నారు…సాంకేతికత లోనూ ,రవాణా లోనూ ,మిగిలిన అన్ని రంగాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిని అందుకున్నామన్నారు…దీనికి బీజేపీ నేతలు ఢిల్లీ మెట్రో నిర్మాణం లో బీజేపీ ది కీలక పాత్ర అంటూ వ్యాఖ్యలు చేయగా” బాబోయ్ మీకో నమస్కారం…అంతా మీ దయ వల్లే జరిగింది.2014 తర్వాతనే ఆకాశం ,భూమి,సూర్యుడు, చంద్రుడు,నక్షత్రాలు, ఈ ప్రపంచం ఏర్పడ్డాయి.అంతా మీదే అంటూ వ్యంగ్యం గా బీజేపీని ,మోడీ నీ ఉద్దేశించి విమర్శించారు…ఒక పక్కన బీజేపీ పై ఆప్ వ్యతిరేక పోరాటం ఈ రీతిన సాగుతుంటే మరో పక్కన దేశం లో ముఖ్యమైన బీజేపీ వ్యతిరేక పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ,కవిత,సిసోడియా( Rahul Gandhi ) వంటి నాయకుల పై వివిధ ఆరోపణల వలన అరెస్టుల ,అనర్హత పర్వం నడుస్తుంది….
ఆప్ ఈ ఎత్తులకు చిత్తవుతుందో ,పై ఎత్తులు వేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి…
.






