ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు:: డి.పి.అర్. ఓ. వంగరి శ్రీధర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రోర్రల్ పాటిస్పేషన్ (స్వీప్)కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై, ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా, గ్రామీణ & పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి 17-03-2 024 నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కలకారులు రెండు టీం లచే నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా పౌర సంబంధాల అధికారి వంగరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణం లో, బొయినిపల్లి మండలం దుండ్రపల్లి గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ కళా ప్రదర్శనను ప్రదర్శించారు.

ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.ఓటు హక్కు మన అందరి హక్కు అని, రాజ్యాంగం ద్వార కల్పించిన ఓటు హక్కును భారత దేశంలోనీ పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్లు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని ఆట పాటల ద్వారా కళ ప్రదర్శనను ఇచ్చి ప్రజలలో ఓటు హక్కు పై గొప్ప అవగాహనను పెంపొందిస్తున్నారనీ జిల్లా పౌర సంబంధాల అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు శ్రీదర్ రెడ్డి, రాములు, పొత్తూరి రాజు,గడ్డం దేవయ్య,పుడూరి సంజీవ్,అంతడుపుల ఝాన్సీ,అంతడుపుల లావణ్య,కిన్నెర శ్రీలత, అనుముల శిరీష,తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News