సాధారణంగా 15లోపు పిల్లలు 30 కిలోల కంటే ఎక్కువ బరువును ఎత్తలేదు.వారికి అంతకంటే ఎక్కువ బరువు( Heavy Weight ) ఎత్తడం చాలా కష్టమైపోతుంది.
కానీ కొంతమంది అసాధారణ ప్రతిభతో కొడుతుంటారు అలాంటివారు తమ బరువు కంటే ఎక్కువ బరువును ఈజీగా ఎత్తేయగలరు.అలాంటి బాలిక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలిక అర్షియా గోస్వామి బరువైన డెడ్లిఫ్ట్స్ ఎత్తడంలో చాలా నిష్ణాతురాలు.ఈ బాలిక తన శరీర బరువు కంటే రెట్టింపు స్థాయిలో డెడ్లిఫ్ట్స్( Deadlifts ) ఎత్తగలదు.
ఆమె బరువు కేవలం 25 కిలోలు, కానీ ఆమె సుమో డెడ్లిఫ్ట్లో 70 కిలోల బరువును ఎత్తి అందర్నీ నోరెళ్ళ పెట్టేలా చేసింది.సుమో డెడ్లిఫ్ట్ అనేది ఒక రకమైన వ్యాయామం, ఇందులో కాళ్ళను వెడల్పుగా ఉంచి నేలపై నుంచి బరువును ఎత్తుతారు.

అర్షియా 70 కిలోల డెడ్లిఫ్ట్స్( 70kgs Deadlifts ) ఎత్తేస్తున్న వీడియోను చాలా మంది ఇంటర్నెట్లో చూశారు.ఆమె శక్తి, నైపుణ్యం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు.ఈ అసాధారణమైన వెయిట్ లిఫ్టర్ వీడియో( Weight Lifter Video )కు ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి.వారు ఆమెకు మద్దతుగా ప్రశంసిస్తూ అనేక కామెంట్స్ చేశారు.“దాదాపు మూడు రెట్లు ఎక్కువైన బరువును లేపావు.నువ్వు చాలా గ్రేట్” అంటూ ఒక వ్యక్తి ప్రశంసలు కురిపించాడు.ఈ బాలిక ఏదో ఒక రోజు భారతదేశం గర్వపడేలా చేస్తుందని మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు.”అద్భుతంగా బరువులు ఎత్తుతున్నావు కీప్ ఇట్ అప్” అని ఒకరు.“ఈ పిల్ల చాలా టాలెంటెడ్, ఈ చిన్నారి 70 కిలోల బరువు ఎత్తడం అంటే అది 75 కిలోల బరువున్న వ్యక్తి 210 కిలోలు ఎత్తడంతో సమానం.” అని మరొకరు అన్నారు.

అర్షియా( Arshia Goswami ) తన వయసులో ఎన్నో రికార్డులు నెలకొల్పింది.ఆమెకు 6 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, డెడ్లిఫ్ట్లో 45 కిలోల బరువును ఎత్తింది.దాంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చింది.2022లో 35.8 కిలోల బరువు ఎత్తి ఆసియా బుక్లోకి కూడా చేరింది.అర్షియాకు పవర్లిఫ్టింగ్, టైక్వాండో రెండూ ఇష్టం.
ఈ చిన్నారి రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది.ఇండియాస్ గాట్ టాలెంట్ అనే టీవీ షోలో కూడా ఆమె తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
ఆమె 30 సెకన్లలో 17 సార్లు 6 కిలోల బంతిని ఎత్తింది.







