ఏపీలోని పలువురు వైసీపీ నేతలకు అరెస్ట్ వారెంట్ జారీ అయిందని తెలుస్తోంది.ఈ మేరకు నేతలు కొడాలి నాని, పార్థసారథి, అడపా శేషుతో పాటు టీడీపీ నేత వంగవీటి రాధాకు ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
2015 వ సంవత్సరంలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన కేసులో హాజరుకాలేదని ప్రజా ప్రతినిధుల కోర్టు తెలిపింది.ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన వీరు ఆ సమయంలో నమోదైన కేసులో ఇప్పటివరకూ న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోవడంపై సీరియస్ అయింది.
ఈ నేపథ్యంలోనే నేతలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.అనంతరం ఆ నలుగురు నాయకులను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.







