కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు..అరెస్ట్, ఈడీ కస్టడీపై తీర్పు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Aravind Kejriwal ) అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టు తీర్పును వెలువరించింది.ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్ పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ( Justice Swarnakant Sharma ) తీర్పును ప్రకటించారు.

 Arvind Kejriwal To Stay In Jail Petition Against Arrest Rejected,arvind Kejriwal-TeluguStop.com

కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు( Trial Court ) ఇచ్చిన తీర్పును సమర్థించిన హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.

అనంతరం ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) కీలక వ్యాఖ్యలు చేసింది.లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీలాండరింగ్ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని హైకోర్టు పేర్కొంది.

ముడుపులు తీసుకోవడంలో కూడా కేజ్రీవాల్ పాత్ర ఉందన్న న్యాయస్థానం ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందారు, ఎలక్ట్రోరల్ బాండ్లను( Electoral Bonds ) ఎవరు కొనుగోలు చేశారనేది కోర్టుకు సంబంధించినది కాదని తెలిపింది.

కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది.సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే హక్కు కేజ్రీవాల్ కు ఉంటుందని తెలిపింది.వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి క్రాస్ ఎగ్జామినేషన్ కు సమాధానం చెప్పవలసి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది.

సాధారణ పౌరుడు, ముఖ్యమంత్రి పట్ల ఒకే రకంగా దర్యాప్తు సంస్థ వ్యవహారిస్తుందన్న హైకోర్టు వేర్వేరు చట్టాలు ఉండవని వెల్లడించింది.ఎన్నికల సమయంతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం అతని అరెస్ట్, రిమాండ్( Arrest,Remand ) ను కోర్టు పరిశీలించవలసి ఉందని చెప్పింది.

కేజ్రీవాల్ విచారణలో చేరకపోవడం, జాప్యం కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉండటానికి కారణమని పేర్కొంది.ఈ క్రమంలోనే న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి ఉంటారు తప్ప రాజకీయాలకు కాదని తేల్చి చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube