ప్రస్తుత సమాజంలో పిల్లల్ని పెంచడం అంటే ఒక పెద్ద సవాల్ గా మారిపోయింది.ఎందుకంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది చేయడం లేదు.
అది వేరే ఎవరైనా చెబితే వింటారు.దీనికి కారణం తల్లిదండ్రులే.
మాట వినడం లేదని పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల పిల్లలు ఎక్కువగా మొండిగా తయారవుతారు.
అందుకని పిల్లలను ఎక్కువగా కొట్టకూడదు.పిల్లలకు క్రమశిక్షణ ( Discipline for children )నేర్పించాలని ప్రతి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.
దీని కోసం ఎన్నో చేస్తూ ఉంటారు.
పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతూ ఉంటారు.
అలాగే తిడుతూ ఉంటారు.కానీ పిల్లల ప్రవర్తన బాగుండాలంటే మాత్రం చిన్న వయసు నుంచి వారికి క్రమశిక్షణ నేర్పించాలి.
ముఖ్యంగా రెండు నుంచి ఐదు సంవత్సరాల వయసు నుంచే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి.ఈ వయసు పిల్లలు తొందరగా మాట వింటారు.
అసలు పిల్లలకు క్రమశిక్షణ ఎలా నిర్మించాలో ఇప్పుడు తెలుసుకుందాం.పిల్లలు మన మాటల కంటే చేతల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు.
అందుకే వాళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి ముందు మీరు క్రమశిక్షణతో ఉండాలి.
ముఖ్యంగా వారితో మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించకూడదు.ఎందుకంటే పిల్లలు మీ మాటలను బాగా వింటారు.అలాగే మాట్లాడతారు.
మీరు చెడుగా మాట్లాడి మీ పిల్లలు మంచిగా మాట్లాడాలని అనుకోవడం మీరు చేసే మొదటి పొరపాటు.కాబట్టి వాళ్లు ఏం చేయాలో మీరు చేసి చూపించాలి.
మీ పిల్లలు మీరు ఎలా ఉంటే వారు కూడా అలాగే ఉంటారు.అరవడం వల్ల పిల్లలకు ఏది నేర్పించలేము.
పిల్లలకు ఏదైనా మంచి విషయాలు చెప్పేటప్పుడు వారి మనసులో తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
వాళ్లకు తెలియని విషయాలను చెప్పాలి.కాదు అనుకున్న దాన్ని అవుతుందని చెప్పాలి.ఇది మీ పిల్లవాడు మీరు చెప్పే ప్రతి దాన్ని జీర్ణించుకునేలా చేస్తుంది.
వాళ్లు అడిగిన ప్రశ్నల కు కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదు.పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర అని కచ్చితంగా చెప్పవచ్చు.
చాలాసార్లు తల్లిదండ్రులు వల్లే పిల్లలు తప్పులు చేస్తారు.ఎందుకంటే పిల్లలు ఏదైనా చెడు మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏమీ అనకుండా నవ్వుకుంటారు.
ఇతరుల విషయం పక్కన పెడితే తల్లిదండ్రులు కూడా ఇలా చేయడం మంచిది కాదు.ఎందుకంటే పేరెంట్స్ ఏమీ అనడం లేదని పెద్దవారైనా పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు.
దీనివల్ల తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది.