ముద్దు పెడితే కడుపు వస్తుందని అనుకున్నాను.. ఆరోహి రావు షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్6 తాజాగా ప్రారంభం కాగా ఈ షో విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఆరోహి రావు అలియాస్ ఇస్మార్ట్ అంజలి ఒకరు.

 Arohi Rao Shocking Comments Goes Viral In Social Media Details Here , Arohi Rao-TeluguStop.com

తాజాగా ఆరోహి రావు మాట్లాడుతూ తన అమాయకత్వానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను చదువుకునే సమయంలో ముద్దు పెడితే కడుపు వస్తుందని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

తాను ఎంబీఏ చదివే రోజులలో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని ఆమె వెల్లడించారు.డిగ్రి చదివే వరకు నాకు లవ్ గురించి పెద్దగా తెలియదని ఎంబీఏ చదివే సమయంలో మాత్రం తాను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని ఆమె కామెంట్లు చేశారు.

ముద్దు పెడితే కడుపు వస్తుందని అనుకునేంత అమాయకత్వం అప్పట్లో ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.అలాంటి నేను ఎంబీఏ చదివే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Arohi Rao, Big Boss, Nagarjuna, Telugu Biggboss, Tollywood-Movie

తాను ప్రేమించిన వ్యక్తి ఎత్తుగా అందంగా ఉండేవాడని ఆమె చెప్పుకొచ్చారు.తాను లవ్ చేసిన వ్యక్తి కాలేజ్ కు సరిగ్గా రాకపోయినా లెక్చరర్లు అడిగిన ప్రశ్నలకు వేగంగా జవాబులు చెప్పేవాడని ఆమె కామెంట్లు చేశారు.తాను ప్రేమించిన అబ్బాయి సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనేవాడని ఆమె వెల్లడించారు.నేను ప్రేమించిన అబ్బాయి ఒకరోజు బ్లాక్ డ్రెస్ లో కనిపించగా అతనిని అలానే చూస్తే ఉండిపోయానని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత అతను నాకు బోర్ కొట్టడంతో అతనికి దూరమయ్యానని ఆమె కామెంట్లు చేశారు.ఆ వ్యక్తి నాకు దూరమైనా ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నాడని కామెంట్లు చేశారు.

తాను లవ్ చేసిన అబ్బాయి కాకుండా నా జీవితంలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని ఆమె అన్నారు.ఆమె వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube