ఐదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా థియేటర్లలో విడుదలైంది.మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండకు, ఇటు షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది.అర్జున్ రెడ్డి విడుదలై ఐదేళ్లు అయిన సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా డిలీటెడ్ సీన్ విడుదలైంది.
సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.173 సెకన్ల నిడివి ఉన్న ఈ సీన్ లో విజయ్ దేవరకొండ రాహుల్ రామకృష్ణల మధ్య జరిగిన సంభాషణను చూపించారు.ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.వీడియోలో విజయ్ దేవరకొండ తాను ముద్దు పెట్టుకోవడానికి గల కారణాలను వెల్లడించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
లైగర్ సినిమా ఫ్లాపైన బాధలో ఉన్న విజయ్ దేవరకొండ అభిమానులు అర్జున్ రెడ్డి వీడియోను చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.
డిలీట్ అయిన వీడియో సినిమాలో ఉండి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అర్జున్ రెడ్డి సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
లైగర్ సినిమా ఫ్లాపైనా ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఈ సినిమాలో నటించారు.విజయ్ దేవరకొండ సినిమసినిమాకు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.విజయ్ పూరీ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన ఆగిపోయినట్టేనని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.