తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా( Bigg Boss Ariyana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ నిజాంపాదించుకుంది.
ఇక రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది అరియానా.తెలుగులో పలు షోలకు యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్,బికినీ ఫోటో షూట్ లు గ్లామర్ ఫోటో షూట్స్( Hot Photoshoots ) చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్( Social Media Trollings ) ని నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.అయితే మొన్నటి వరకు బుల్లితెరపై సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో బుల్లితెరకు కాస్త దూరమైన విషయం తెలిసిందే.
కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గానే ఉంటోంది.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో అరియానా గుర్తుపట్టలేని విధంగా చాలా లావుగా మారిపోయింది.దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా ఆమె షేర్ చేసిన ఫోటోలపై నేటిజన్స్ దారుణమైన కామెంట్ చేస్తూ రెచ్చిపోయారు.
కాగా అరియానా ఇటీవల ఒక ప్రోగ్రామ్ కోసం ఇతర దేశాలకి వెళ్లింది.

అక్కడ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపి ఈ మధ్యే ఇండియాకి వచ్చిన అరియానా కొత్త వ్లాగ్స్, రీల్స్, ఫోటోషూట్ లు అప్లోడ్ చేసింది.అయితే ఈ ఫోటోలలో అరియానా కాస్త బొద్దుగా కనిపించింది.అయితే ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేసారు.
ఒకరైతే ఏకంగా ఆంటీలా ఉన్నావని అనేశాడు.దాంతో అరియానాకి కోపమొచ్చింది.
నేను ఎలా ఉంటే నీకేంటిరా, నేను నా లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతున్నాను.నువ్వు అది కూడా లేదు కదా.నచ్చకపోతే అన్ ఫాలో కొట్టేయ్.ధైర్యముంటే ముందుకొచ్చి మాట్లాడురా.
బ్రెయిన్ హార్ట్ తో ఆలోచించు మాట్లాడురా అదేమీ లేకపోయినా పర్లేదు అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటిరా అసలు నీకేంటి రా ప్రాబ్లమ్.ఎవరి లైఫ్ వాళ్ళది.
నువ్వేమైనా మంత్లీ బిల్స్ పే చేస్తున్నావా? మంత్లీ రెంట్ కడుతున్నావా? లేక ఎవరినైనా చేసుకుంటున్నావా.అంటూ అరియానా సదరు నెటిజన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడింది.