వాట్సాప్ మెసేజ్‌ల విషయంలో గొడవ.. రోడ్డుపై ఎంత భయంకరంగా కొట్టుకున్నారో చూడండి..

ఈరోజుల్లో స్కూల్ స్టూడెంట్ల మధ్య ఫైట్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయి.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 Argument Over Whatsapp Messages See How Badly Beaten Up On The Road , School Fig-TeluguStop.com

ఒకరినొకరు చంపేసుకునేలా, రౌడీల్లా వారు కొట్టుకుంటున్న తీరు చూసి ఆందోళన చెందుతున్నారు.తాజాగా అలాంటి మరో స్కూల్ ఫైటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ ( Amity University, Noida )విద్యార్థుల మధ్య ఈ గొడవ జరిగింది.సోషల్ మీడియాలో దీనికి సంబంధించి 2 క్లిప్స్‌ హల్‌చల్ చేస్తున్నాయి.మొదటి వీడియోలో, ఒక బాయ్ స్టూడెంట్, ఒక ఫిమేల్ స్టూడెంట్‌ తీవ్రమైన వాగ్వాదం పెట్టుకోవడం చూడవచ్చు.తరువాత వారు ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకున్నారు.వాట్సాప్ చాట్‌ల( WhatsApp chats ) విషయంలో వీరిద్దరూ గొడవ పడినట్లు సమాచారం.నన్నే కొడతావా అని సదరు ఫిమేల్ స్టూడెంట్ తన మగ స్నేహితులను పిలిచింది.

ఆ తరువాత వారు సదరు మేల్ స్టూడెంట్‌ను చితక్కొట్టుడు కొట్టారు.గుద్దుతూ, తన్నుతూ, రోడ్డు మీద పడేస్తూ, గోడకు నూకేస్తూ ఆ లేడీ స్టూడెంట్ ఫ్రెండ్స్ రెచ్చిపోయారు.

ఒక ఫ్రెండ్ అయితే బాక్సింగ్ లోలాగా పంచులు కురిపిస్తూ సదరు బాయ్ స్టూడెంట్ కు చుక్కలు చూపించాడు.ఆ దెబ్బలకు చనిపోతాడేమో అని చాలామంది చూసి షాక్ అయిపోయారు.

ఒక యువతి వచ్చి వారిని ఆపింది.లేకుంటే వీరు అతడిని చంపేసినా చంపేసేవారు.

ఈ దృశ్యాలన్నీ మరో వీడియోలో రికార్డ్ అయ్యాయి.అది కూడా వైరల్ అవుతోంది.

చాలామంది నెటిజన్లు ఇంతలా కొట్టేలా స్నేహితులను రెచ్చగొట్టిన అమ్మాయిని తిట్టిపోస్తున్నారు.ఈ షాకింగ్ వీడియోను మీరు చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube