ఎన్టీఆర్ ను హత్య చేసింది నువ్వు కాదా... ? లక్ష్మి పార్వతి సంచలన కామెంట్స్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేయడంపై మొదలైన వివాదం రోజురోజుకు మరింత తీవ్రత రూపం దాల్చుతోంది.ప్రధానంగా వైసిపి,  టిడిపి మధ్య మొదలైన విమర్శలు ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలను ఒక్కొక్కటి వెలుగులోకి తెస్తూ టిడిపి , ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఇరుకుని పెట్టే విధంగా అధికార పార్టీ వైసిపి ప్లాన్ చేస్తోంది.

 Aren't You The One Who Killed Ntr. Lakshmi Parvati Sensational Comments , Ntr, L-TeluguStop.com

ఈ వ్యవహారంలో లక్ష్మీపార్వతి పైనే అనేక కామెంట్స్ వస్తున్న నేపద్యంలో తాజాగా ఆమె స్పందించారు.ఏ రోజు తాను పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని,  తాను ఎటువంటి స్వార్థంతోను ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని లక్ష్మీపార్వతి క్లారిటీ ఇచ్చారు.

అసలు అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిందని అప్పట్లో ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.
   నేను ఆయన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత టిడిపి ఘన విజయం సాధించిందని చెప్పిన లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.” చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా ?  చంద్రబాబు నమ్మించి గొంతు కోస్తాడని ఎన్టీఆర్ నాతో చాలాసార్లు చెప్పారు .అయితే ఎన్టీఆర్ కు ద్రోహం చేయబోనని చంద్రబాబు నాకు ప్రమాణం చేశారు అని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆనాడే అన్నారు.చంద్రబాబు రోజుకు అబద్ధం మాట్లాడుతారు.ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలి.ఇప్పటికైనా పశ్చాత్తాప పడతారా ? చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈటీవీని లాంచ్ చేశారు.రామోజీ పిచ్చి రాతలపై అప్పట్లోనే ఎన్టీఆర్ స్పందించారు.
 

Telugu Chandrababu, Ntr, Radhakrishna, Ramoji Rao-Politics

 ఎన్టీఆర్ పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్ లు వేశారు ఎల్లో మీడియా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచింది.తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళనలు సృష్టించారు.అప్పటి స్పీకర్ యనమల వెన్నుపోటులో భాగస్వామ్యం అయ్యాడు .వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా ? రామోజీరావు చంద్రబాబు రాధాకృష్ణ కలిసి కుట్ర చేశారని , ఎన్టీఆర్ ప్రధాని అవతారన్న భయంతోనే కుట్ర చేశారు.ఎన్టీఆర్ ను చంపిన హంతకుల గురించి అందరికీ తెలియాలి.అధికారంలో ఉన్న ఏ రోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా చంద్రబాబు.,?  ఎన్టీఆర్ పేరు తీసివేయాలని రాధాకృష్ణ నువ్వు మాట్లాడుకోలేదా ? ఎన్టీఆర్ ది హత్య కాదా ఆ హత్య వెనుక నువ్వు రామోజీ లేరా అంటూ లక్ష్మీపార్వతి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube