ఇటీవల అన్నీ సోషల్ మీడియా సంస్థలు షార్ట్ వీడియోలు పెట్టుకునే వెసులుబాటును తీసకొచ్చాయి.వాట్సప్‌లో ( WhatsApp )వీడియోను స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం రాగా.
ఇక ఫేస్ బుక్, యూట్యూబ్‌లో కూడా షార్ట్ వీడియోల ఫీచర్ అందుబాటులోకి వచ్చిgది.ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టుకునే సౌలభ్యం వచ్చింది.
గతంలో ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్( Reels on Instagram ) సౌకర్యం లేదు.కొత్తగా రీల్స్ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వాటికి ఆదరణ బాగా పెరిగింది.

అయితే షార్ట్ వీడియోలు, రీల్స్ ను కొంతమంది గంటలకొద్ది అలాగే చూస్తూ ఉంటారు.దీని వల్ల సమయం వృధా అవ్వడంతో పాటు స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది.మొదట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో 30 సెకన్లు మాత్రమే రీల్ పెట్టుకునే అవకాశం ఉండేది.ఇఫ్పుడు దానిని 90 సెకన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.దీని వల్ల ఎక్కువసేపు రీల్స్ చూడటం వల్ల చాలా సమయం వృథా అవుతుంది.అలాగే ఎక్కువసేపు ఫోన్ ను చూడటం వల్ల మానసిక సమస్యలు( Psychological problems ) కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అలాగే ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్ల తలనొప్పి( headache ) రావడంతో పాటు ఫోన్ నుంచి వచ్చే కాంతి వల్ల కళ్లకు నష్టం కులుగుతుంది.వెలుతురు ఎక్కువసేపు కంటిపై పడటం వల్ల కంటిచూపు మందగించే అవకాశం ఉంటుంది.ఫోన్ ను ఎక్కువసేపు ఉపయోగిస్తే నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.అలాగే గుండెపోటు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.గంటలకొద్ది సోషల్ మీడియాలో ఉండటం మంచిది కాదని చెబుతున్నారు.అలాగే కొన్ని సున్నితమైన వీడియోలు మీ మూడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
దీని వల్ల కూాడా ఎక్కువ నష్టం జరుగుతుందని చెబుతున్నారు.