అల్లం పేస్టు రెడీమేడ్ వాడుతున్నారా? అయితే ఇక్కడ చూడండి!

అల్లం పేస్టు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.మసాలాలు లేనిదే మనకు ముద్దైనా దిగదు అనుకోవాలి.

 Are You Using Ready Made Ginger Paste? But Look Here, Ginger, Garlic, Paste, M-TeluguStop.com

మరీ ముఖ్యంగా మాంసాహారం వండేటప్పుడు అల్లం పేస్టు వేసి వండాల్సిందే.లేదంటే మనకి టేస్ట్ అనిపించదు.

ముఖ్యంగా మాంసాహారానికి ఘాటు తగలాలంటే అల్లం పేస్ట్( Ginger Garlic Paste ) దట్టించాల్సిందే.అయితే ఈ మధ్య మనకి బద్ధకం ఎక్కువైపోయి బయట దొరికే రెడీమేడ్ అల్లం పేస్ట్ లను తెగ వాడిపడేస్తున్నారు.

ఈరోజుల్లో నాణ్యత అనే మాట పక్కనబెట్టి డబ్బులను పోగేసుకొనేవారే ఎక్కువైయ్యారు.అవును, అల్లం పేస్ట్ లో విపరీతమైన కల్తీ వాడుతున్నారు.

అడ్డమైన కెమికల్స్ వాడుతున్నారు.

Telugu Garlic, Ginger, Gingergarlic, Latest, Paste-Latest News - Telugu

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా హైదరాబాద్( Hyderabad ) లో వెలుగు చూస్తున్నాయి.కల్తీకి అనర్హం కాదేది అన్నట్లు కల్తీగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు.ఇటీవల జరిగిన దాడులను మరువక ముందే ఇప్పుడు మరో కల్తీ బాగోతం బట్టబయలైంది.

అవును.తాజాగా రంగారెడ్డి జిల్లాలో కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొన్ని ముఠాల భరతం పడుతున్నారు తెలంగాణ పోలీసులు.వంటల్లో వాడే అల్లం పేస్ట్‌లో ప్రమాదకర కెమికల్స్ కలుపుతోంది ఓ ముఠా.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఓసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు.

Telugu Garlic, Ginger, Gingergarlic, Latest, Paste-Latest News - Telugu

ఉప్పరపల్లి( Upparapalli )లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర కెమికల్స్ కలుపుతూ, శుభ్రత పాటించకుండా ఓ ముఠా అల్లం పేస్ట్ తయారు చేయగా సమాచారం అందుకున్న అధికారులు పక్క ప్లాన్ ప్రకారం ఆకస్మిక దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి ఏకంగా 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.అల్లం పేస్టు నిర్వాహకులు దిల్దర్ అలీ జాన్సన్, సోనుకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఇంకా ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube