Phone pay Google pay : ఫోన్ పే, గూగుల్ పేలు వాడుతున్నారా... వెంటనే ఈ విషయం తెలుసుకోండి జరా?

ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ యుగం అయిపోయింది.ప్రస్తుతం నగదు బదిలీ వ్యవహారాలన్ని ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయని వేరే చెప్పాల్సిన పనిలేదు.

 Are You Using Phone Pay And Google Pay , Phone Pay, Google Pay, Latest News,sma-TeluguStop.com

ఈ క్రమంలో దేశ ప్రజలు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్ లను విరివిగా వాడుతున్నారు.చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆర్థిక వ్యవహారాలు క్షణాల్లో జరిగిపోతున్నాయి.

ప్రజలు కూడా వీటికే మొగ్గు చూపుతున్నారు.ఇపుడు దాదాపు చిన్న, పెద్ద వ్యాపారస్తులందరూ తమదగ్గర ఫోన్ పే, గూగుల్ పే తాలూక స్కానర్లు ఉంచుతున్నారు.

ఈ నేపథ్యంలో కస్టమర్లు 99 శాతం స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.ఇపుడు దాదాపు లిక్విడ్ క్యాష్ వాడటం తగ్గిపోయింది.అంతా ఆన్ లైన్ పేమెంట్ కే మొగ్గు చూపుతున్నారు.ఇంకా భవిష్యత్ లో కూడా అనేక మార్పులు సంభవించే అవకాశాలు లేకపోలేదు.

ఇక అసలు విషయంలోకి వెళితే, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలతో ఫోన్ పే, గూగుల్ పేలకు ఇపుడు షాక్ తగలనుంది.పేమెంట్ యాప్స్ మార్కెట్ షేర్ 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు త్వరలో అమలులోకి రానున్నాయి.

Telugu Amazon Pay, Google Pay, Latest, Phone Pay, Smart Phone-Latest News - Telu

దాంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి సో కాల్డ్ సంస్థలకు భారీ నష్టాలు రానున్నాయి.తాజా లెక్కల ప్రకారం ఫోన్ పే 46.7 షేర్, గూగుల్ పే 33.3 షేర్ మేర స్పష్టం చవిచూడనున్నాయి.దీనిపై సదరు యాజమాన్యాలు కేంద్రం తీసుకునే నిర్ణయం మరో మూడేళ్లు పొడిగించాలని అడుగుతున్నాయి.అయితే ఈ భారం యూజర్లపై కూడా పడనుంది.వివిధ ట్రాన్సాక్షన్లపైన చార్జీలు గట్టిగా విధించనున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆన్ లైన్ సంస్థలు కొన్ని ఆమోదం తెలిపినప్పటికీ మరికొన్ని విభేదిస్తున్నాయి.

మరికొన్ని రోజుల్లో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube