తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి కీర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చాలామంది కీర్తి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం సీరియల్ హిమ అంటే చాలు గుర్తుపట్టేస్తారు.
కీర్తి ఇప్పటికే బుల్లితెరపై సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.కదా ప్రస్తుతం కీర్తి బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే కీర్తి బిగ్ బాస్ హౌస్ లో ఉంది అని రెండు మూడు సందర్భాలలో మాత్రమే కనిపించింది.అది కూడా నామినేషన్స్ విషయంలో మాత్రమే.
కీర్తి ఎక్కువగా కెమెరా కంట పడకుండా ఫిజికల్ టాస్కులలో కూడా సరిగ్గా పాల్గొనడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కీర్తి హెల్త్ కండిషన్ పక్కనపెట్టి మరి ఇంటి పనిలో అలాగే టాస్కుల విషయంలో ఫైటర్ లాగా పోరాడుతున్నప్పటికీ ఆమె కృషి ఎవరికి సరిగా కనిపించడం లేదు.
అంతేకాకుండా ఆమె గేమ్ సరిగా ఆడటం లేదు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.అయితే తాజాగా కీర్తి విషయంపై వస్తున్న వార్తలపై ఎలిమినేట్ కంటెస్టెంట్ ఆరోహి రావు స్పందించింది.
కీర్తి ఫిజికల్ టాస్కులు ఏమీ ఆడటం లేదు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.కానీ వారికి నేను ఇచ్చే సమాధానం ఏమిటంటే ఆ పిల్ల రెండు కాళ్లలో ఐరన్ రాడ్స్ ఉన్నాయి.
ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు.

అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి తన వంతుగా కృషిగా గట్టిగానే ప్రయత్నిస్తోంది.బిగ్ బాస్ హౌస్ లో ఆ విషయాన్ని మాట్లాడకుండా సింపతి కోసం ట్రై చేయకుండా డ్రామా చేయకుండా ప్రతిసారి తన బెస్ట్ ఇస్తోంది.అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గుర్తులు తాలూకా పెద్ద పెద్ద మచ్చలు తమ చేతులకు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
మచ్చ కదా అంత తొందరగా పోదు.అన్ని మంచిగా ఉన్నా మనమే అలసిపోతున్నాం అలాంటిది అన్ని లోపాలు పెట్టుకొని కూడా ఇంట్లో ఫైట్ చేస్తోంది ఎప్పటికీ నేను కీర్తిని సపోర్ట్ చేస్తాను అని రాసుకొచ్చింది ఆరోహి.







