రేవంత్ రెడ్డికి కొత్త శత్రువుల్ని తయారు చేస్తున్నారా..?

10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ( BRS ) పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు కాంగ్రెస్ పార్టీ.

ఇక కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సంవత్సరంలో చాలా పుంజుకుంది.

=దానికి ప్రధాన కారణం కూడా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఎన్నిక కావడమే.పిసిసి చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డికి కొత్త కొత్త శత్రువుల్ని సృష్టిస్తుంది.అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి సహాయపడ్డారు అందులో డౌటే లేదు.

కానీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డి సీఎం చేయాలని అలాగైతే చంద్రబాబుకు కూడా సహాయపడతారని, ఈయన కాకుండా వేరే ఎవరైనా సరే చంద్రబాబుకి అంతగా ఉపయోగముండదని,ఈ కారణంతోనే ఎల్లో మీడియా రేవంత్ రెడ్డికి కొత్త కొత్త శత్రువులను సృష్టిస్తూ వస్తున్నారు.

Advertisement

ఇక కొత్త శత్రువులు అంటే ఎవరో కాదు కాంగ్రెస్ ( Congress ) పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేస్తున్నారు.అయితే అసలు విషయం ఏమిటంటే.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరు సీఎం అవుతారని ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం ఉంది.

అయితే చాలామంది రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలి అని అనుకున్నప్పటికీ ఆయనకంటే సీనియర్ లు చాలామంది ఉన్నారు.ఒకవేళ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకోకపోతే ఓటింగ్ జరుగుతుంది అని తెలుస్తోంది.

ఓటింగ్ లో ఎవరికీ ఎక్కువగా మద్దతు వస్తే వాళ్లే సీఎం అవుతారని సమాచారం.

అయితే ఇప్పటికీ సిఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది.ఇక ఏది క్లారిటీ లేక ముందే ఇదిగో రేవంత్ సీఎం అదిగో రేవంత్ సీఎం అంటూ ప్రచారాలు చేస్తున్నారు.అయితే ఇలా జరిగితే కచ్చితంగా రేవంత్ రెడ్డికి పార్టీలోనే శత్రువులు తయారవుతారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఇప్పటికే రేవంత్ పీసీసీ చీఫ్ అయిన సమయంలో అధిష్టానం పై చాలామంది సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.అయితే కాంగ్రెస్ ఇంకా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేదు.

Advertisement

ఇంకో ఐదు స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ కి వచ్చేది.అయితే ఇలాంటి సమయంలో ఎల్లో మీడియా ఇలా రేవంత్ మీద హైప్ పెంచుతూ మిగిలిన వారికి కోపం తెప్పిస్తే మాత్రం కాంగ్రెస్లో ఏదైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక సీఎం ఎవరైనా పరవాలేదు కానీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డి గురించి హైప్ పెంచడం వల్ల కాంగ్రెస్లో ఆయనకు కొత్త కొత్త శత్రువులు తయారవుతారు.ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న చాలా మంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) పై కాస్త అసంతృప్తితో ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం రేవంత్ రెడ్డిని దెబ్బ కొడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు