Rathika Rose: రాహుల్ సిప్లిగంజ్ రతిక రోజ్ మధ్య చిచ్చు పెట్టింది వారేనా.. అందుకే లవ్ బ్రేకప్ అయ్యిందా..?

ఎప్పుడైతే బిగ్ బాస్ 7 (Bigg Boss 7) లోకి రతిక రోజ్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి ఆమెకు సంబంధించిన లవ్ ఫెయిల్యూర్ వార్తలు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే మొదటి రోజు ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో రతిక లవర్ ఎవరు అని అందరూ అనుమానపడ్డారు.

 Are They The Cause Of The Breakup Between Rathika Rose And Rahul Sipligunj-TeluguStop.com

కానీ ఆ టైంలో ఎవరు కూడా రతిక లవర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul sipligunj) అని గుర్తు పట్టలేకపోయారు.కానీ హౌస్ లోకి వచ్చాక ఓ రోజు రతిక రాహుల్ కోసం ఏడవడం అలాగే బిగ్ బాస్ రాహుల్ పాడిన ఒక పాట ప్లే చేయడంతో అందరికీ రతిక రాహుల్ మధ్య ఉన్న ప్రేమ విషయం బయటపడింది.

ఇక ఈ వార్త బయట పడ్డాక అందరూ రతిక రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య బ్రేకప్ కి కారణం పునర్నవి అని భావించారు.ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ హౌస్ లోకి వచ్చాక పునర్నవి (Punarnavi) తో క్లోజ్ గా ఉండడం వల్లే రతిక రాహుల్ కి బ్రేకప్ చెప్పింది అని అనుకున్నారు.

కానీ అసలు విషయం వేరే ఉందట.అదేంటంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రతిక రోజ్ తన బ్రేకప్ కి కారణం చెప్పింది.

Telugu Bigg Boss, Love Break, Punarnavi, Rahul Sipligunj, Rathika Rose, Rathikar

రతిక (Rathika) ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ పేరు తీయకుండా మాట్లాడుతూ.నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను.ఆ తర్వాత ఓ సినిమా చేసే సమయంలో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను.కానీ అదే సమయంలో నా లవర్ పేరెంట్స్ మాత్రం నువ్వు పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలి.

సినిమాలు వదిలేసి ఏదైనా జాబ్ చేయు అంటూ నాకు కండిషన్ పెట్టారు.దాంతో ఇప్పుడిప్పుడే నాకు సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

Telugu Bigg Boss, Love Break, Punarnavi, Rahul Sipligunj, Rathika Rose, Rathikar

ఇక అలాంటి టైం లో వీరు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండమంటున్నారు.కానీ ఈ పరిస్థితుల్లో నేను పెళ్లికి దూరంగా ఉండటమే మంచిది.పెళ్లి చేసుకోవడానికి ఇంకాస్త టైం తీసుకుంటాను అని నిర్ణయించుకున్నాను అంటూ రతిక రోజ్ (Rathika Rose) ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది.అయితే రతిక రాహుల్ సిప్లిగంజ్ ల మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణం రాహుల్ ఫ్యామిలీ పెట్టిన కండిషనే అని తెలుస్తోంది.

వాళ్లు సినిమాలకు దూరంగా ఉండమని కండిషన్ పెట్టడం వల్లే అది ఇష్టం లేని రతిక రాహుల్ కి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube