బీఆర్ఎస్ వాళ్లే పట్టభద్రులా? మిగతా వాళ్లు కాదా?: మల్లు రవి

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తీన్మార్ మల్లన్నను పల్లి - బఠాని అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) అర్హుడని ఈసీ చెప్పిందని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ వాళ్లే పట్టభద్రులా మిగతా వాళ్లు కాదా అని ఆయన ప్రశ్నించారు.

పట్టభద్రుల పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏంటో కనిపిస్తుందని తెలిపారు.కేటీఆర్ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ మాటలపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.ఈ క్రమంలోనే కేటీఆర్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు