టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం సత్యభామ( Satyabhama ).ఇందులో కాజల్ ప్రధాన పాత్రలో నటించింది.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా బాలయ్య బాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ వారసత్వం గురించి స్పందించారు.
తెలుగు సినిమా గొప్పదనం గురించి వివరిస్తూ వారసత్వం అంటే ఎన్టీఆర్( NTR ) పేరు చెప్పుకోవడమో ఆయన గొప్పదనం చాటింపు చేయడమో కాదని, ఆయన బాటలో నడుస్తున్నామా లేదాని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమని అన్నారు.ఆ లెగసిని కాపాడుకునేందుకు ఎంత కష్టపడాలి అన్న విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు బాలయ్య బాబు.ఇకపోతే సత్యభామ సినిమా విషయానికి వస్తే.
కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషించిన సత్యభామ జూన్ 7 విడుదల కానుంది.శశికిరణ్ తిక్కా సమర్పణ, స్క్రీన్ ప్లే అందించగా సుమన్ చిక్కాల ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఇకపోతే ఇప్పటికే సత్యభామ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఈ సినిమా కోసం కాజల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.