శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే అది కచ్చితంగా యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు కాళ్ళ నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.పాదాలు, పాదాల వెళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు లాంటివి కనిపిస్తూ ఉంటాయి.

ఇలాంటివన్నీ మన శరీరంలో యూరిక్ ఆసిడ్( Uric acid problem ) పెరుగుదల లక్షణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాలలో యూరిక్ యాసిడ్ ఒకటి అని దాదాపు చాలా మందికి తెలియదు.

మనం తీసుకునే ఆహార పదార్థాలలోని ప్యూరిన్ అనే రసాయనం విచ్చినం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది.

అయితే విసర్జన సరిగ్గా జరగకపోయినప్పుడు యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది.

Advertisement

క్రమంగా ఇది స్ఫటికాలుగా మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాలలో పేరుకుపోతుంది.దీని వల్ల కీళ్ల నొప్పులు( Joint pains ) పెరుగుతాయి.ప్యూరిన్ లు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.

అలాగే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, హై బీపీ, మెటబాలిక్‌ సిండ్రోమ్, అధికంగా మద్యం తాగడం, పేగుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువ కదలికలు లేని జీవన విధానంలో ఉండడం, వేళకు తినడం, నిద్రపోవడం, తగినంత నీరు తాగకపోవడం లాంటి వాటి వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది.మనలో ఈ లక్షణాలు కనుక కనిపించినట్లయితే దాన్ని యూరిక్ యాసిడ్ గా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

యూరిక్ యాసిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతివేళ్లు, కాలి వేళ్లలో ఎక్కువ నొప్పి ఉంటుంది.కొన్ని సార్లు ఈ నొప్పులు భరించలేనంత ఎక్కువగా ఉంటాయి.వేళ్ల దగ్గర వాపులు కనిపిస్తూ ఉంటాయి.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

శరీరంలో నొప్పి ఉన్న దగ్గర వాపు రావడం, బుగ్గలు రావడం లాంటివి ఉంటాయి.బాగా అలసటగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

Advertisement

శరీరంలో ఎక్కువ యూరిక్ యాసిడ్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది.దీని వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది.

ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తూ ఉంటే వారు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.యూరిక్ యాసిడ్ సమస్యను దూరం చేసుకోవాలంటే కొన్ని ఆహారపు అలవాటులను మార్చుకోవాలి.

ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.మద్యానికి( Alcohol ) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.విందు వినోదాలలో భోజనం ఎక్కువగా తీసుకోకూడదు.

తాజా వార్తలు