వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల పంటలకు ఇన్నీ ప్రయోజనాలా..?

రైతులు ఎలాంటి పంటలు సాగుచేసిన ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందాలంటే పంటలను చీడపీడల, తెగుళ్ళ బెడద నుంచి, కలుపు మొక్కల నుంచి సంరక్షించుకోవాలి.అంటే వేసవి కాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకోవాలి.

 Are There So Many Benefits To The Crops Due To Deep Plowing In Summer , Farmers,-TeluguStop.com

రైతులు( Farmers ) చాలా వరకు రబీలో సాగు చేసిన పంటల కోతల అనంతరం పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు.మళ్లీ వర్షాకాలం వచ్చేవరకు భూమిని దున్నడం లేదు( plowing in summer ).దీంతో పొలంలో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరుగుతున్నాయి.ఈ మొక్కలు భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిలో ఉండే మొత్తం సారాన్ని పీల్చేస్తాయి.

దీంతో అధిక దిగుబడుల కోసం రైతులు అనవసరంగా రసాయన ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.కాబట్టి నాణ్యమైన పంట దిగుబడులు సాధించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు.

Telugu Alluvial Soils, Benefitscrops, Bacteria, Farmers, Fungi, Fungus, Red Soil

రైతులు తక్కువ పెట్టుబడి వ్యయం, తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించాలంటే కచ్చితంగా వేసవికాలంలో నేలను రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.లోతు దుక్కులు దున్నడం వల్ల నేలలో ఉండే కలుపు విత్తనాలు ( Weed seeds ) నాశనం అవడంతో పాటు చీడపీడలు, తెగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియా, ఫంగస్, శిలీంద్రాలు ( Bacteria, fungus, fungi ) చాలా వరకు నాశనం అవుతాయి.

Telugu Alluvial Soils, Benefitscrops, Bacteria, Farmers, Fungi, Fungus, Red Soil

ఇక ఎర్ర నేలలు, మెట్ట నేలలు( Red soils, alluvial soils ) చాలా వరకు వాలుగా ఉంటాయి.వర్షాకాలంలో వర్షం కారణంగా నేల కోతకు గురవుతుంది.దీంతో పొలంలోని పోషక పదార్థాలు, మెత్తటి మట్టి వాననీటికీ కొట్టుకుపోతుంది.దీంతో భూమి సారహీనంగా మారుతుంది.కాబట్టి నేలలో ఉండే భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు మరింత భూసారం పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.వేసవికాలంలో తొలకరి జల్లులు కురిసిన తర్వాత భూమిని బాగా దుక్కి చేసుకోవాలి.

దీంతో భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది.రైతులు ప్రతి ఏడాది కాకపోయినా కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారైనా వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నడం వల్ల వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube