వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్ల పంటలకు ఇన్నీ ప్రయోజనాలా..?

రైతులు ఎలాంటి పంటలు సాగుచేసిన ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందాలంటే పంటలను చీడపీడల, తెగుళ్ళ బెడద నుంచి, కలుపు మొక్కల నుంచి సంరక్షించుకోవాలి.

అంటే వేసవి కాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకోవాలి.రైతులు( Farmers ) చాలా వరకు రబీలో సాగు చేసిన పంటల కోతల అనంతరం పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు.

మళ్లీ వర్షాకాలం వచ్చేవరకు భూమిని దున్నడం లేదు( Plowing In Summer ).

దీంతో పొలంలో కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరుగుతున్నాయి.ఈ మొక్కలు భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిలో ఉండే మొత్తం సారాన్ని పీల్చేస్తాయి.

దీంతో అధిక దిగుబడుల కోసం రైతులు అనవసరంగా రసాయన ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

కాబట్టి నాణ్యమైన పంట దిగుబడులు సాధించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. """/" / రైతులు తక్కువ పెట్టుబడి వ్యయం, తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించాలంటే కచ్చితంగా వేసవికాలంలో నేలను రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.

లోతు దుక్కులు దున్నడం వల్ల నేలలో ఉండే కలుపు విత్తనాలు ( Weed Seeds ) నాశనం అవడంతో పాటు చీడపీడలు, తెగుళ్ళకు సంబంధించిన బ్యాక్టీరియా, ఫంగస్, శిలీంద్రాలు ( Bacteria, Fungus, Fungi ) చాలా వరకు నాశనం అవుతాయి.

"""/" / ఇక ఎర్ర నేలలు, మెట్ట నేలలు( Red Soils, Alluvial Soils ) చాలా వరకు వాలుగా ఉంటాయి.

వర్షాకాలంలో వర్షం కారణంగా నేల కోతకు గురవుతుంది.దీంతో పొలంలోని పోషక పదార్థాలు, మెత్తటి మట్టి వాననీటికీ కొట్టుకుపోతుంది.

దీంతో భూమి సారహీనంగా మారుతుంది.కాబట్టి నేలలో ఉండే భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు మరింత భూసారం పెంచుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

వేసవికాలంలో తొలకరి జల్లులు కురిసిన తర్వాత భూమిని బాగా దుక్కి చేసుకోవాలి.దీంతో భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది.

రైతులు ప్రతి ఏడాది కాకపోయినా కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారైనా వేసవి కాలంలో లోతు దుక్కులు దున్నడం వల్ల వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.

శ్రీ విష్ణు చేసిన స్వాగ్ సినిమా హిట్టా.? ఫట్టా.?