ఆ హీరోయిన్ తో నటించాలి అని ఆశ పడుతున్న తారక్ అభిమానులు ? మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ?

ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్ ముందుకు దూసుకుపోతున్నారు ,వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సూపర్ హిట్స్ తన కాతాలో వేసుకుంటున్నారు .సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని, స్టార్ హీరో ,సీనియర్ హీరో ఎవరైతే ఏమిటి ? స్క్రిప్ట్ బాగుండాలి ,డైరెక్టర్ కాంబినేషన్ ఆ సినిమా హీరోయిన్ రోల్ వైవిధ్యంగా ఉంటే చాలు యంగ్ టాలెంటెడ్ హీరోయిన్స్ తమ దగ్గరకు వచ్చి నేరేషన్ ఇచ్చిన డైరెక్టర్స్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు .ఇక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అందం టాలెంట్ ఉంటే హీరోయిన్ కు అవకాశాలు తొందరగా వస్తాయి అని అనడం లో ఎటువంటి సందేహం లేదు .హీరోయిన్ కెరీర్ లో మొదటి సినిమా ఒక్క సాలిడ్ హిట్ అందుకుంటే ఆ తరువాత గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ క్యూ కడతాయి .

 Are Tarak Fans Hoping To Act With That Heroine? And Who Is That Heroine , Sree-TeluguStop.com
Telugu Koratala Shiva, Ntrkoratala, Ntrsreeleela, Tollywood, Trinadh Rao-Latest

ఇక అసలు విషయానికి వెళ్ళితే .2021 లో డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరి రోనంకి డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిసందD సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల .పెళ్లిసందD సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల అందానికి యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఇక మాస్ మహారాజ్ రవితేజ -డైరెక్టర్ త్రినాధ్ రావ్ నక్కిన కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ ధమాకా మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించింది .ఇక ఈ మూవీ ట్రైలర్స్ ,టీజర్స్ ,సాంగ్స్ ,రవితేజ యాక్టింగ్ ,హీరోయిన్ శ్రీలీల గ్లామర్ యాక్షన్ సీన్స్ ,కామెడీ సీన్స్ ,ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల డాన్స్ ,యాక్టింగ్ , గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు .ఇక ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీల కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆఫర్స్ క్యూ కట్టాయి .ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.

Telugu Koratala Shiva, Ntrkoratala, Ntrsreeleela, Tollywood, Trinadh Rao-Latest

ఇక మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళితే .ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ హీరోగా ఎదిగిపోయారు .ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే .అయితే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కానీ ,ఈ సినిమాలో నటించే కాస్టింగ్ కు సంబందించిన విషయాలు అయితే తెలియలేదు .అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసారు కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది అఫీషియల్ గా ఎనౌన్సుమెంట్ చేయలేదు .అయితే ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సరసన ఒక యంగ్ హీరోయిన్ నటిస్తే చూడాలని ఉంది అంటూ ఎంతోమంది నందమూరి అభిమానులు కోరుకుంటున్నారట.ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్ గా కొనసాగుతున్న యంగ్ టాలెంటెడ్ గ్లామర్ హీరోయిన్ శ్రీలీల.

అయితే శ్రీ లీలా మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే.ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ప్రేక్షకులకు పూనకాలే అనే అభిమానులు అనుకుంటున్నారు .ఒకవేళ కొరటాల శివ సినిమాలో సెకండ్ సెకండ్ హీరోయిన్ పాత్రకు ఛాన్స్ ఉంటే ఆ రోల్ కోసం శ్రీలీలను ఎంపిక చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తే బాగుటుంది గాని, మరి నిజంగా డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ఉందా ? ఒక వేళ సెకండ్ హీరోయిన్ రోల్ ఉంటే ఆ పాత్రకు హీరోయిన్ శ్రీలీల ను తీసుకుంటున్నారా అనే విషయంలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే .

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube