నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు ఈయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు.నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసారా సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
ఇక ఈ ఏడాది ఈయన అమిగోస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానుంది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు విభిన్న పాత్రలలో నటించి సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కళ్యాణ్ రామ్ తన చేతి పై ఉన్న టాటూ గురించి ఆ టాటూ వేయించుకోవడం వెనుక ఉన్న కథ గురించి తెలిపారు.

కళ్యాణ్ రామ్ తన చేతి పై తన భార్య స్వాతి పేరును టాటూగా వేయించుకున్నారు.అయితే తన భార్య పేరును టాటూగా వేయించుకోవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే 2007 -8సంవత్సరంలో తాను తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యానని తెలిపారు.ఆ సమయంలో అందరూ భార్యలు వారి భర్త పట్ల కేర్ తీసుకుంటారు కొందరు వారే చూసుకోగా మరి కొందరు నర్సులను పెడతారు.
ఆ సమయంలో స్వాతి మాత్రం నా దగ్గర ఉండి నాకు కావలసిన అవసరాలన్నింటినీ తీర్చారని కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఇక మా మ్యారేజ్ డే సందర్భంగా తనకు ఏదైనా గిఫ్ట్ కావాలంటే అడగమని చెప్పగా తనకు నేను నా పిల్లలు పెద్ద గిఫ్ట్ అని చెప్పారు.అయితే ఆ సమయంలో తనకు తన భార్య పేరును ఎప్పటికీ గుర్తుండి పోయేలా టాటూ వేయించుకోవాలని అనిపించిందని అందుకే ఈ టాటూ వేయించుకున్నానని తెలిపారు.నిజానికి నాకు సూదులు అంటే చాలా భయం కానీ స్వాతి పై ఉన్న ప్రేమతో ఇలా తన పేరును టాటూగా వేయించుకున్నానని మొదటిసారి తన టాటూ వెనుక ఉన్న సీక్రెట్ గురించి వెల్లడించారు.







