రైతులు బిచ్చగాళ్లగా కనిపిస్తున్నారా?: మంత్రి నిరంజన్ రెడ్డి

కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ కు రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలు లేవని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.అయితే కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని తెలిపారు.

తెలంగాణ వ్యవసాయం దేశానికే రోల్ మోడల్ అని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు