తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ( Congress party ) అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం అని ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అయితే గత ఆర్నెళ్ల ముందు వరకు పూర్తిగా డీలా పడిన హస్తం పార్టీ కేవలం ఈ రెండు నెలల్లో పుంజుకుందా ? నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా ? లేదా హస్తం పార్టీ చేస్తున్న హడావిడి యేనా ? అనే సందేహాలు చాలామందిలో వ్యక్తమౌతున్నాయి.అయితే అధికారం మాదే అని హస్తం నేతలు చేస్తున్న హడావిడి వెనుక ఆ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీలు కనుగోలు( sunil kanugolu ) ఉన్నారనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.

కర్నాటకలో( Karnataka ) కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సునిల్ కనుగోలు స్ట్రాటజీలు ముఖ్య పాత్ర పోషించాయి.ఆ పార్టీ యొక్క మేనిఫెస్టో( Manifesto ) రూపకల్పనలోనూ వ్యూహాత్మకంగా హస్తం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనూ సునీల్ స్ట్రాటజీలు హస్తం పార్టీకి సత్ఫలితాలను ఇచ్చాయి.అందుకే టి కాంగ్రెస్ కు కూడా సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పని చేస్తున్నారు.అయితే ఆ మద్య ఆయన కాంగ్రెస్ కు బై బై చెప్పారనే వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం సునీల్ ఇంకా కాంగ్రెస్ పార్టీకే వ్యూహకర్తగా పని చేస్తున్నారట.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న డిజిటల్ ప్రకటనలు, వినూత్న ప్రచారాలు ఇవన్నీ కూడా సునీల్ కనుగోలు వ్యూహంలోనివే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ముఖ్యంగా సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ గట్టిగానే యూస్ చేసుకుంటోంది.ఆ పార్టీ ప్రకటనలతో కేసిఆర్( KCR ) ను ఇరుకున పెడుతూ బిఆర్‌ఎస్ కు చెక్ పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు హస్తం నేతలు.ప్రస్తుతం హస్తం పార్టీ చేస్తున్న హడావిడి అంతా కూడా సునీల్ కనుగోలు వ్యూహంలో భాగమే.
కర్నాటకలో మాదిరి ఇక్కడ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి చర్చించుకునేలా చేసి ఓటర్లను ఆకర్షింకఃలనేది మెయిన్ ప్లాన్ గా తెలుస్తోంది.మొత్తానికి తెలంగాణలో కూడా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు వ్యూహాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది.