టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ కొత్త పార్టీని ప్రకటించి అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచారు.2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుండగా విజయ్ సీఎం అవుతారా లేదా అనే చర్చ జోరుగా జరుగుతోంది.అయితే విజయ్ కు ఓటు వేయనని అరవింద్ స్వామి( Aravind Swamy ) షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అరవిందస్వామి ఈ కామెంట్లు చేశారు.
తమిళనాడు వేట్రి కళగం( Vetri Kalagam ) పేరుతో విజయ్ కొత్త పార్టీని మొదలుపెట్టారు.విజయ్ ( Vijay )హీరోగా కొనసాగుతున్నా ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) పోటీకి తమ పార్టీ దూరమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు.విజయ్ కచ్చితంగా సీఎం అవుతారని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.
అయితే అరవింద స్వామి మాట్లాడుతూ తాను రజనీ, కమల్, విజయ్ లకు అభిమానినని అన్నారు.

ఆ హీరోలపై నాకు ఎంత అభిమానం ఉన్నా వాళ్లకు ఓటు మాత్రం వేయనని అరవింద స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒక యాక్టర్ కు మంచి ప్రభుత్వ విధానాలను చేసే అర్హత ఉంటుందని ఎలా నమ్ముతారని అరవింద స్వామికి ప్రశ్న ఎదురు కాగా పాలిటిక్స్ చేయడం సినిమాలలో నటించినంత సులువు కాదని అన్నారు.పాలిటిక్స్ గురించి నేర్చుకోవడం కూడా ముఖ్యమని వెల్లడించారు.

యాక్టర్లకు రాజకీయాల గురించి ఎంత తెలుసని సినిమాల్లో హీరో ప్రజలను కాపాడినట్టు పాలిటిక్స్ లో చేయడం కుదరదని పేర్కొన్నారు.గతంలో ఒక సందర్భంలో అరవింద స్వామి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.







