అమెరికా తెలుగుసంఘం..ఆప్త...10 వ వార్షికోత్సవం.

అమెరికా వెళ్లి స్థిరపడాలని అనుకునో లేదా చదువుల రిత్యా వెళ్లాలని అనుకున్న వారో ఒక్క సారిగా ఆలోచించే విషయం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి ఉంటుంది అదేంటంటే దేశం కాని దేశంలో మనం వెళ్లి ఉంటున్నాం కనీసం ఎవరన్నా పలకరించే వాళ్ళు ఉంటారా.? మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఉంటారా అనే సందేహం భయం వెంటాడుతుంది అలాంటి పరిస్థితుల్లో నుంచీ పుట్టిన తెలుగు సంఘమే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ “ఆప్త”.

మన కోసం మనం అనే నినాదంతో తెలుగు వారి అందరని ఒక కటుంబం చేర్చి 2008 లో సింగిల్ డిజిట్ తో ప్రారంభమైన ఆప్తుల సంఖ్య నేడు పది వేల సంఖ్యకు చేరుకుంది.అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ఉంటున్న ఎంతో మంది తెలుగువారిని ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చింది.ఆప్త దాంతో ప్రతీ ఏటా వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది కూడా “ఆప్త” పదవ వార్షికోత్సవ సభలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు వాషింగ్టన్ డిసి మేరి ల్యాండ్ బాల్టిమోర్ లో జరిగే ఆప్త జాతీయ మహాసభలకు ప్రపంచ నలుమూలల నుండి ఆప్త కుటుంబ సభ్యులు వేల మంది హాజరు కానున్నట్టు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజకీయ, పారిశ్రామిక, సినీ, వివిధ రంగాల్లోని ప్రముఖులను ఆహ్వానించినట్లు ఆప్త బోర్డు చైర్ శ్రీమతి రాధిక నైగాపుల ఒక ప్రకటనలో తెలుపారు.ఆప్త ద్వారా గతంలో చేసిన సేవా మరియు ఇతర కార్యక్రమాలు మరియు భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించుకుంటామని తెలిపారు.

ఈ సదస్సుని మూడు రోజుల నిర్వహించనున్నామని ఆప్తా ప్రెసిడెంట్ గోపాల గూడపాటి తెలిపారు.

Advertisement
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు