ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేసిన APSRTC..!!

ఏపీలో ఏప్రిల్ మూడవ తారీకు నుండి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.ఈ క్రమంలో APSRTC పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేసింది.

విషయంలోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులలో పదవ తరగతి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో ప్రయాణించే విద్యార్థులు పరీక్ష హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని స్పష్టం చేయడం జరిగింది.

ఏప్రిల్ 3 నుంచి 18వ తారీకు వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.

ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షా సమయం.కనుక ఏపీలో పరీక్ష రాసే విద్యార్థులు ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ( RTC organization ) తెలియజేసింది.పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఇతర చర్యలపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి.

Advertisement

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ క్రమంలో విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 3780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు ఆరు లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు