వారంలో 2 సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

ముఖ చర్మం పై ఎలాంటి మచ్చ, మొటిమ లేకుండా క్లియర్ అండ్ గ్లోయింగ్ గా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.

కానీ అలాంటి చర్మాన్ని పొందడం అసాధ్యమని భావిస్తుంటారు.

అయితే అది సాధ్యమే.అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.

వారంలో రెండు సార్లు ఈ ఫేస్‌ ప్యాక్ ను కనుక వేసుకుంటే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరి ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు ఫ్రెష్ వేపాకులు వేసి ఉడికించాలి.

Advertisement

వాటర్ సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి వేసుకొని కలుపుకోవాలి.

చివరిగా సరిపడా వేపాకుల నీటిని వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్ర‌ష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై నార్మ‌ల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మంచి మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే చర్మం పై మొటిమలు, మొండి మచ్చలు క్రమంగా దూరం అవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

దాంతో క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు