గూగుల్ మ్యాప్స్ పనిచేయక దిక్కు తోచని స్థితిలో ఓ జంటని ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్ రక్షించిందిలా?

ప్రపంచ నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ దిమ్మతిరిగే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చి అద్భుతాలు సృష్టిస్తోంది.అవును, ఈ స్మార్ట్ ఫోన్లోని ప్రత్యేకమైన శాటిలైట్ ఫీచర్ ఇప్పటికే అనేక మంది ప్రాణాలను కాపాడగా తాజాగా మరో జంటని పెను ప్రమాదం నుండి కాపాడింది.

 Iphone 14 Emergency Sos Via Satellite Feature Saves Two Women,apple Iphone 14,em-TeluguStop.com

గత ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOSను ప్రవేశ పెట్టింది.ఈ ఫీచర్ ఇపుడు అద్భుతాలు చేస్తోంది.

దాంతో ఈ సిరీస్ ఫోన్ కోసం మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది.

Telugu Apple Iphone, Appli Iphone, Canada, Emergency Sos, Google Maps, Satellite

అసలు విషయంలోకి వెళితే, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని రాబ్సన్ వ్యాలీ ప్రాంతంలో మెక్‌బ్రైడ్ అరణ్యంలో ఓ జంట చిక్కుకు పోయారని కెనడియన్ నివేదిక అధికారికంగా ప్రకటించింది.అయితే సదరు జంట తప్పిపోయిన విషయాన్ని ఐఫోన్ 14లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ ద్వారా గుర్తించినట్టు తెలుసుకొని హుటాహుటిన బయలుదేరి వారి ప్రాణాలను కాపాడారట.నిజంగా అద్భుతం కదూ.సదరు సిరీస్ ఫోన్ వారు వాడటం వారి అదృష్టంగా భావించవచ్చు.అక్కడ ప్రధాన రహదారిలో గూగుల్ మ్యాప్స్ తప్పుగా సూచించడంతో ఓ జంట దారి తప్పిపోయారు.

దాదాపు 20 కి.మీ.లు డ్రైవింగ్ చేసిన తర్వాత అక్కడ ఇరుక్కుపోయారు.

Telugu Apple Iphone, Appli Iphone, Canada, Emergency Sos, Google Maps, Satellite

దాంతో వారికి సెల్యులార్ కనెక్టివిటీ కూడా లేకుండా పోయింది.అయితే ఇద్దరిలో ఒకరికి ఐఫోన్ 14 ఉంది.ఆపిల్ కాల్ సెంటర్‌కు ఎమర్జెన్సీ సిగ్నల్‌ని పంపగా కాల్ సెంటర్ కెనడాలోని నార్తర్న్ 911ని సంప్రదించింది.

ఆ తరువగా వారిని BC సెర్చ్ అండ్ రెస్క్యూతో రక్షించారు.శాటిలైట్ ఫీచర్ ద్వారా ఆపిల్ అత్యవసర SOS లేకుండా, రెస్క్యూ టీమ్ వారిని కనుగొనేందుకు ఎక్కువ సమయం తీసుకుంది.

GPS కోఆర్డినేట్‌లను ట్రాక్ చేసిన తర్వాత ఆ బృందం వారు ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగింది.ప్రస్తుతం, శాటిలైట్ ద్వారా అత్యవసర SOS టెక్స్ట్ కోసం మాత్రమే పని చేస్తుంది.

ఈ సమయంలో ఇద్దరు యూజర్లు కాల్‌లు చేయలేరు.వినియోగదారులు శాటిలైట్ ద్వారా అత్యవసర SOSకి పంపినప్పుడు మెసేజ్ ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube