వచ్చే నెలలో హైదరాబాద్‌కు యాపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ .. ఎవరీ డాక్టర్ సుంబుల్ దేశాయ్..?

దిగ్గజ టెక్ సంస్థ యాపిల్‌లో హెల్త్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా వున్న భారత సంతతికి చెందిన డాక్టర్ సుంబుల్ అహ్మద్ దేశాయ్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు.ఫిబ్రవరి25న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బయోఏషియా 2023 సదస్సు జరగనుంది.హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్ ఇందుకు వేదిక కానుంది.

 Apple Health Vp Dr Sumbul Desai To Visit Hyderabad On February Details, Apple He-TeluguStop.com

ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో కలిసి సుంబుల్ దేశాయ్ పాల్గొంటారు.

ఇది భారత ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ) భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బయోఏషియా కాన్‌క్లేవ్ 20వ ఎడిషన్.

ప్రఖ్యాత లైఫ్ సెన్సెస్ అకాడెమియా, హెల్త్‌కేర్ లీడర్స్, స్టార్టప్‌లు, రెగ్యులేటర్లు, పెట్టుబడిదారులు ఒకే వేదికపైకి రానున్నారు.భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, వాటిని పౌరులకు ఎలా అందించవచ్చో ఈ సందర్భంగా చర్చించనున్నారు.

ఈ సదస్సుకు 120 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని అంచనా.దీనికి సంబంధించిన లోగో, థీమ్‌ను తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గతేడాది ఆగస్టులో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Telugu Apple Company, Apple, Apple Vp, Bioasia, Dr Sumbul Desai, Hyderabad, Sumb

యాపిల్ కీనోట్‌లు, హెల్త్ యాప్, ఫీచర్ రిచ్ వాచ్‌ల అభివృద్ధి వెనుక డాక్టర్ దేశాయ్ కీలకపాత్ర పోషించారు.స్వీడన్‌లో జన్మించిన దేశాయ్.యాపిల్ క్లినికల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మెడికల్ రీసెర్చ్, క్లినికల్ పార్ట్‌నర్‌షిప్‌ల వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు.హార్వర్డ్ టీహెచ్ వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థలకు యాపిల్ పలు విషయాల్లో సహకరిస్తున్న సంగతి తెలిసిందే.మిగిలిన వాటిలో రీసెర్చ్ కిట్, కేర్ కిట్ ఫ్లాట్‌ఫాంలతో ల్యాండ్ మార్క్ హెల్త్ స్టడీస్,

Telugu Apple Company, Apple, Apple Vp, Bioasia, Dr Sumbul Desai, Hyderabad, Sumb

అడ్వాన్స్‌డ్ డిస్కవరీని నిర్వహించడానికి చాన్ స్కూల్ ఆప్ పబ్లిక్ హెల్త్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలు వున్నాయి.ఇక ఇటీవల యాపిల్ నుంచి వచ్చిన వాచ్ సిరీస్‌ 8కు మంచి స్పందన వస్తోంది.ఎన్నో ప్రత్యేకతలున్న ఈ వాచ్‌ను గాడ్జెట్ లవర్స్ ఎగబడి సొంతం చేసుకుంటున్నారు.హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించిన అదనపు ఫీచర్స్ వుండటమే దీని ప్రత్యేకత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube