తెలంగాణ విద్యుదు‌త్ప‌త్తి పై ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఆరోపణ

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో వివాదం రేకెత్తింది.శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాల్వ‌పై తెలంగాణ విద్యుదు‌త్ప‌త్తి చేప‌డుతోంద‌ని ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఆరోపించింది.

 Ap Water Resources Department Allegation On Telangana Electricity Generation-TeluguStop.com

సాగు, తాగు నీటి అవ‌స‌రాల నేప‌థ్యంలో తెలంగాణ విద్యుదుత్ప‌త్తిని త‌క్ష‌ణ‌మే నిలుపుద‌ల చేయించాల‌ని కోరుతూ ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) కృష్ణా న‌ది నీటి యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు.ప్రస్తుతం శ్రీశైలంతో పాటు నాగార్జున సాగ‌ర్‌లోనూ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం ఉంద‌ని, అయితే ఇప్ప‌టికిప్పుడు విద్యుదుత్పాద‌న చేప‌డితే ఖ‌రీఫ్ చివ‌రిలో సాగు నీటితో పాటు తాగు నీటికి కూడా ఇబ్బంది ఎదురు కానుంద‌ని ఏపీ ఈఎన్‌సీ త‌న లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ విద్యుదుత్ప‌త్తి కార‌ణంగా జ‌లాశ‌యాల్లోని నీరు వృథాగా స‌ముద్రం పాలు అవుతుందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ చేప‌డుతున్న విద్యుదుత్ప‌త్తిని త‌క్ష‌ణ‌మే నిలుపుద‌ల చేయించాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో కేఆర్ఎంబీని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube